క్యారెట్ తెగ తింటున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ఇటీవల కాలంలో ఆరోగ్యం విషయంలో ప్రజలలో చాలా చైతన్యం వచ్చింది. ఏమి తినాలి? ఏమి తినకూడదు అని తెలుసుకొని తింటున్న వారు చాలామంది ఉన్నారు. అయితే మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వాటిలో కొన్నింటిని మాత్రం ఎంపిక చేసుకొని మరీ తింటున్నారు. అలాంటి వాటిల్లో క్యారెట్ ఒకటి . పచ్చి క్యారెట్ లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించి క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు.
క్యారెట్ లో ఫుల్ పోషకాలు
క్యారెట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ b6, విటమిన్ కే వన్ తో పాటు క్యారెట్ లో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేడ్లు, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. క్యారెట్ తిన్నవారికి కంటి చూపు మెరుగుపడుతుంది.

క్యారెట్ తో గుండె ఆరోగ్యం
క్యారెట్ లో ఉండే లుటీన్ జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని వృద్ధాప్యం బారి నుండి కాపాడతాయి. క్యారెట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన జీర్ణవ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధక సమస్యలు నివారిస్తుంది. క్యారెట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులు రాకుండా క్యారెట్ కాపాడుతుంది.
క్యారెట్ తో చెడు కొలెస్ట్రాల్ కు చెక్
క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మానికి మేలు చేస్తాయి. క్యారెట్ ను మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు. క్యారెట్ రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తాయి. క్యారెట్ లో ఉండే పీచు పదార్థాలు మన శరీరానికి మేలు చేస్తాయి రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించడంలో క్యారెట్ సహాయపడుతుంది. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల డైటింగ్ చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
క్యాన్సర్ ప్రారంభ దశలోనే నివారించే క్యారెట్
ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది . ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. క్యారెట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రారంభ దశలోనే నాశనం చేసే సామర్థ్యం క్యారెట్ కు ఉంది. చర్మం కోసం కూడా క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి క్యారెట్ లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి దోహదం చేస్తాయి. క్యారెట్ గొప్ప గుణాలను గురించి తెలుసుకున్న వారు ప్రతిరోజు క్యారెట్ ను ఆహారంలో భాగంగా చేసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications