చికెన్ బోన్స్ తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!!

చాలామంది చికెన్ చాలా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ తినే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే చికెన్ బోన్స్ కూడా నమిలి తింటారు. చికెన్ బోన్స్ లో ఉన్న మూలుగని కూడా ఇష్టంగా తింటారు. అయితే చికెన్ బోన్లు తినొచ్చా? చికెన్ బోన్స్ తింటే ఏం జరుగుతుంది? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

చికెన్ బోన్స్ తింటే మంచిదేనా
చికెన్ తో పాటు చికెన్ బోన్స్ తింటే మంచిదే.. చికెన్ బోన్ మజ్జలో కొల్లాజెన్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్, గ్లైసిన్ మరియు గ్లూకోసమైన్‌తో సహా అనేక ఆరోగ్య-ప్రోత్సాహక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యం మరియు కీళ్ల పనితీరుకు సహాయపడతాయి. ఎముక మజ్జ విటమిన్ ఎ మరియు బి, అలాగే జింక్, ఐరన్, కాల్షియం మరియు సెలీనియం వంటి ఖనిజాలను కూడా అందిస్తుంది.

Eating chicken bones Must Know These facts about chicken bones and bone marrow

చికెన్ బోన్ మ్యారోతో ఆరోగ్య ప్రయోజనాలు
చికెన్ బోన్ మ్యారో మీకు చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే అనేక పోషకాలు ఉన్నాయి . చికెన్ ఎముకల మజ్జాలో ఉండే కొల్లాజెన్ ఎముకలు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బలాన్నిస్తుందిగ్లూకోసమైన్ ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు మరియు వాపులతో బాధపడే వారికి ఉపయోగ పడుతుంది.

చికెన్ బోన్స్ లో బోలెడు పోషకాలు
గ్లైసిన్ మరియు కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండి మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. విటమిన్లు A మరియు B, విటమిన్లు B1, B5 మరియు B7 కూడా ఉన్నాయి, ఇవి జీవక్రియ మరియు శక్తి మార్పిడికి సహాయపడతాయి. చికెన్ బోన్స్ మూలుగ లో ఖనిజాలు జింక్, ఐరన్, కాల్షియం మరియు సెలీనియం ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలు ఇస్తాయి.

బ్రాయిలర్ కోళ్ళ బోన్స్ అసలే తినొద్దు
కాబట్టి చికెన్ బోన్స్ తినటం మంచిదే.. అయితే బ్రాయిలర్ కోళ్ళ చికెన్ బోన్స్ మాత్రం అసలే తినొద్దు.. బ్రాయిలర్ కోడి మాంసంతోపాటు చికెన్ బోన్స్ తినేవాళ్లు ఆ చికెన్ బోన్స్ లో మానవ శరీరానికి హాని చేసే గొప్ప ప్రమాదం పొంచి ఉందని తెలుసుకోవాలి. బ్రాయిలర్ కోళ్ళు త్వరగా పెరగటం కోసం వాటికి ఇంజక్షన్ లు ఇస్తారు. ఆ ఇంజక్షన్ ల ప్రభావం కోళ్ళ బోన్స్ పైన కూడా ఉంటుంది.

బ్రాయిలర్ కోళ్ళకు ఇంజక్షన్లు .. బోన్స్ తింటే డేంజర్
ఇలాంటి కోళ్లలో ఎముకతో పాటు అందులో ఉండే మూలుగను తింటే డేంజర్ అని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇలా పెంచిన బ్రాయిలర్ కోడి ఎముకలను అస్సలు నమలకూడదని ఎంతో మంది శాస్త్రవేత్తలు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోడి ఎముకలు మానవ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమవుతాయని చెబుతున్నారు.

క్యాన్సర్ తో పాటు పలు వ్యాధులు
ముఖ్యంగా ఇలా ఇంజక్షన్ లతో పెరిగిన కోళ్ళ ఎముకలు తింటే క్యాన్సర్ తో పాటు ఏడు రకాల వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. బ్రాయిలర్ కోడి కాకుండా నాటు కోడి నేచురల్ గా పెంచిన దానిని అయితే ఆ కోడి బోన్స్ కూడా తినొచ్చు.. బోలెడు పోషకాలు మన శరీరానికి వస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+