చికెన్ స్కిన్ తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!!
చాలామంది చికెన్ స్కిన్ లెస్ తినడానికి ఇష్టపడతారు. చికెన్ స్కిన్ తో తింటే మంచిది కాదని భావిస్తూ ఉంటారు. అయితే చికెన్ స్కిన్ తో తింటే మంచిదేనా? చికెన్ స్కిన్ తో తింటే ఏం జరుగుతుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చికెన్ స్కిన్ తినొచ్చా
దాదాపుగా ఎక్కువ మంది చికెన్ షాప్ కి వెళ్ళినప్పుడు స్కిన్ లెస్ చికెన్ మాత్రమే తెచ్చుకుంటారు. అయితే స్కిన్ తో చికెన్ తింటే డేంజర్ అని వారంతా భావిస్తారు. అయితే స్కిన్ తో చికెన్ తినడం హానికరం అన్నది కేవలం ఊహ మాత్రమే. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం చికెన్ స్కిన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దానిని పరిమితంగా తినాల్సి ఉంటుంది .

చికెన్ స్కిన్ లో ఉండేది ఇదే
ఎక్కువ మొత్తంలో తినకుండా తక్కువ మొత్తంలో చికెన్ స్కిన్ తిన్నట్లయితే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చికెన్ స్కిన్ లో కొవ్వు ఉంటుందని, అది గుండెకు హాని చేస్తుందని చెబుతారు. కానీ కొవ్వు విషయానికి వస్తే ఒక ఔన్స్ చికెన్ స్కిన్ లో కేవలం ఎనిమిది గ్రాముల అసంతృప్త కొవ్వు, మూడు గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది .
స్కిన్ చికెన్ మంచిది ఇందుకే
చికెన్ స్కిన్ పరీక్షించిన నిపుణులు దీనిలో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వు ఉన్నట్టు గుర్తించారు. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి పనిచేస్తుందని, హార్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుందని చెబుతున్నారు. ఇక స్కిన్ లేని చికెన్ కంటే స్కిన్ ఉన్న చికెన్ వండుకొని తినడం మంచిది. ఎందుకంటే స్కిన్ లేని చికెన్ కు ఎక్కువ నూనె తీసుకుంటుంది. అదే స్కిన్ ఉన్న చికెన్ తక్కువ నూనెను గ్రహిస్తుంది .
చికెన్ స్కిన్ ఇలానే తినాలి
స్కిన్ లెస్ చికెన్ వల్ల అధికంగా నూనె మన శరీరంలోకి చేరుతుంది. అదే స్కిన్ ఉన్న చికెన్ తో అయితే తక్కువ నూనె మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే చికెన్ చర్మాన్ని మాత్రం ఎక్కువ తినడం మంచిది కాదు. ఒకవేళ స్కిన్ ఎక్కువ పరిమాణంలో తిన్నట్లయితే అది మీ శరీరంలో మంటకు కారణం అవుతుంది. కాబట్టి తక్కువ మోతాదులో చికెన్ చర్మాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
చికెన్ స్కిన్ ఇలా చెయ్యొద్దు
ఇక స్కిన్ తోటి చికెన్ ఫ్రై చేసుకోవాలి అనుకునేవారు చర్మం క్రిస్పీగా మారేవరకు వేయించితే దానిలో ఉండే అన్ని మంచి పోషకాలు పోతాయి కాబట్టి బాగా వేయించడం మంచిది కాదు. ఇక మొత్తంగా స్కిన్ తో చికెన్ తినడం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని తినడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications