పీతలు తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన శైలి, మంచి ఆహారపు అలవాట్లు ఉండాలి. అయితే మన ఆరోగ్యంలో మన ఆహారం కూడా కీలక భూమిక పోషిస్తుంది. ఇక ఆహారంలో నాన్ వెజ్ వంటకాలు అయిన చికెన్, మటన్, చేపలతో పాటు చాలామంది పీతలను కూడా తింటూ ఉంటారు. అయితే కొంతమంది పీతల గురించి విన్నప్పటికీ పీతలను ఎక్కువగా తిని ఉండరు.
పీతలు తింటే ఏమవుతుందో తెలుసా
ప్రస్తుత మనం పీతల గురించి చెప్పుకోబోయే ఈ వార్త వింటే కచ్చితంగా పీతలు ఎక్కడున్నాయని కనుక్కొని తెప్పించుకొని మరీ తింటారు. పీతలో ఉండే పోషకాలు తెలిస్తే పీతలు మనకు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా పీతలను మీ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. పీతలు మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యం పైన సానుకూల ప్రభావం పడుతుంది.

పీతలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు
పీతలలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పీతలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అలాగే నరాలకు శక్తినిచ్చి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పీతలు లీన్ ప్రోటీన్ కు అద్భుతమైన మూలాలని చెప్పాలి. ఇది మన బరువును నియంత్రించి ఆరోగ్యకరంగా బ్రతికేలా చేస్తుంది. ఇక పీతలలో ఉండే జింక్, సెలీనియం వంటి ఖనిజాలు మనుషులలో రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి.
ధైరాయిడ్ గ్రంధి పని తీరును మెరుగుపరిచే పీతలు
థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంలో కూడా పీతలు కీలక పాత్ర పోషిస్తాయి. పీతలలో విటమిన్ బి 12 తో పాటు ఫోలేట్, ఐరన్ సెలీనియం, నియాసిన్, ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. పీతలలో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఇది కండరాలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది.
పీతలతో మెదడు ఆరోగ్యం, గుండె పదిలం
పీతలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మనల్ని గుండెజబ్బుల బారి నుండి కాపాడుతుంది. అలాగే రక్తపోటుని తగ్గించి హైబీపీ నుండి సంరక్షిస్తాయి. పీతలను క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పీతలు మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే అన్ని పోషకాలు ఉన్న అద్భుతమైన ఆహారం కాబట్టి పీతలను కచ్చితంగా మాంసాహారులు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగానూ పుష్టిగాను ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications