దోసకాయ తింటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
దోసకాయ పుచ్చకాయ, గుమ్మడికాయ, సొరకాయ వంటి తీగ జాతికి చెందిన కూరగాయ. మనకు ఎప్పటికీ అందుబాటులో ఉండే కూరగాయ దోసకాయలో బోలెడు పోషకాలు ఉంటాయి . దోసకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, పీచు వంటి ఎన్నో పోషకాలతో దోసకాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
దోసకాయలతో బరువుకు చెక్
దోసకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దోసకాయలను తింటారు. మరి దోసకాయల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తుతం తెలుసుకుందాం. దోసకాయలు బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. దోసకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేడ్లు, చక్కెర తక్కువ స్థాయిలో ఉంటాయి, అందువల్ల దోసకాయలను తింటే బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.

జీర్ణ వ్యవస్థకు దోసకాయతో మేలు
దోసకాయల లో ఉండే పీచు మన పొట్టను నిండుగా ఉండేలా చేసి ఎక్కువ ఆకలి కాకుండా చేస్తుంది. దోసకాయలో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. దోసకాయలలో ఎక్కువ కంటెంట్ నీరు ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. విపరీతమైన శరీర వేడి సమస్యలతో బాధపడేవారు దోసకాయలు తింటే మంచిది.
బీపీ, కీళ్ళ నొప్పులు తగ్గించే దోసకాయ
దోసకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతే కాదు దోసకాయలో ఉండే పోషకాలు మన కండరాలు, ఎముకల అభివృద్ధికి మేలు చేసి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. దోసకాయలను తింటే మన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. అంతేకాదు రక్తనాళాలలో కొవ్వు చేరకుండా దోసకాయ కాపాడుతుంది.
గుండె ఆరోగ్యానికి,క్యాన్సర్ నివారణకు దోసకాయ
మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దోసకాయ తగ్గిస్తుంది.
ఇక దోసకాయలలో ఉండే పోషకాలు క్యాన్సర్ నివారణకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రెస్టేజ్ క్యాన్సర్ తో బాధపడేవారు దోసకాయలను తింటే కొంతమేర క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేయవచ్చు. దోసకాయలపై ఉండే పొట్టు సైతం మనకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
చర్మాన్ని కాపాడే దోసకాయ
ఇక దోసకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని కాపాడతాయి. చర్మం ముడతలు రాకుండా నిరోధిస్తాయి. మన చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దోసకాయను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తింటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications