ఎండు రొయ్యలు తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!!

చాలామంది ఎండు రొయ్యలు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి చాలా ఘాటుగా వాసన వస్తాయని, వాటిని తింటే కూడా నోరు, చేతులు వాసన వస్తాయని భావిస్తూ ఉంటారు. అయితే ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఎండు రొయ్యలతో కలుగుతాయని చెప్పొచ్చు.

ఎండు రొయ్యలలో బోలెడు పోషకాలు
చిన్న ఎండు రొయ్యలను, రొయ్య పొట్టును తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో విటమిన్లు, అయోడిన్, ప్రోటీన్లు, జింక్, పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ కూడా ఉంటాయి. ఎండు రొయ్యలను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి బరువును తగ్గించడం.

Eating dried shrimps Must Know These facts and advantages

ఎండు రొయ్యలు తింటే ఈ రోగాల నుండి విముక్తి
ఎండు రొయ్యలు తింటే అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు. ఎండు రొయ్యల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండు రొయ్యల్లో విటమిన్ బి 12, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి .కాబట్టి ఇవి మన శరీరానికి కావలసిన కండరాల బలానికి, నరాల బలానికి ఉపయోగపడతాయి.

ఎండు రొయ్యలతో పురుషులలో శృంగార సామర్ధ్యం పెంపు
శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వారానికో 15 రోజులకు ఎండు రొయ్యలను తినడం ఎంతో మేలు చేస్తుంది. జుట్టు కుదుర్లను దృఢంగా ఉంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి. ఎండు రొయ్యలలో ఉండే జింక్, సెలీనియం మగవారిలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. వీర్యం యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది . ఎండు రొయ్యలు వీర్యకణాల సంఖ్యను కూడా పెంచుతాయి.

గుండెకు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఎండు రొయ్యలు
ఎండు రొయ్యల లో విటమిన్ బి12 ఉండడం వల్ల ఇవి రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎండు రొయ్యలను తినేవారిలో ఆల్జీమర్స్ సమస్య తగ్గుతుంది. ఎండు రొయ్యల లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటిని తింటే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. మొత్తంగా ఎండు రొయ్యలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి వాసన విషయాన్ని పక్కన పెట్టి నిరభ్యంతరంగా ఎండు రొయ్యల కూరను ఒక పట్టు పట్టేయండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+