చలికాలంలో పైనాపిల్ తింటున్నారా? అయితే ఆగండి!

పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. పైనాపిల్ లో ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఇది ఉష్ణ మండల ప్రాంతాలకు చెందిన ఒక రుచికరమైన పండు .తియ్యటి రుచి, వాసన తో ఉండే ఈ పైనాపిల్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పైనాపిల్ చలికాలంలో తినక పోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీళ్ళు పైనాపిల్ తినొద్దు
చలికాలంలో పైనాపిల్ ఎక్కువగా తినొద్దని, ఇది తినడం వల్ల నోరు కొట్టుకుపోయే ప్రమాదం వస్తుందని చెబుతున్నారు. గర్భిణీలు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో పైనాపిల్ ని తినడం మంచిది కాదని, ఇది గర్భస్రావాన్ని పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో చాలా మంది అలర్జీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు పైనాపిల్ తినడం మంచిది కాదని చెబుతున్నారు.

Eating pineapple in winter Know the health risks of pineapple eating in this season

ఈ నొప్పులతో పైనాపిల్ తినొద్దు
పైనాపిల్ అలర్జీని మరింత పెంచుతుందని ఇందులో ఉండే ఎంజైమ్ లు పెదవులు మందంగా మారడం, నోరు కొట్టుకుపోవడం వంటి దుష్ప్రభావాలకు కారణం అవుతుందని చెబుతున్నారు. ఇక ఆర్థరైటిస్ తో బాధపడేవారు పైనాపిల్ ను శీతాకాలంలో పొరపాటున కూడా తినకూడదు. ఇది కీళ్లనొప్పులను, ఒళ్ళు నొప్పులను తీవ్రతరం చేస్తుంది.

ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ జోలికి పోకండి
సైనస్ సమస్యలు శీతాకాలంలోనే ఎక్కువ వేధిస్తాయి. ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి రావడం, కఫం సమస్యలు చోటు చేసుకోవడం, పొడి దగ్గు రావడం వంటి ఇబ్బందులు శీతాకాలంలోనే వస్తాయి.ఈ సమస్యలతో బాధపడేవారు పైనాపిల్ అస్సలు తినకూడదు.తింటే సమస్య మరింత జటిలం అవుతుంది. పైనాపిల్ లో ఎక్కువ మొత్తంలో సుక్రోజ్ షుగర్ ఉంటుంది. ఇది త్వరగా జీర్ణం కాదు.

షుగర్ ఉన్నవారు, యాంటీ బయాటిక్స్ వాడేవారు పైనాపిల్ తినొద్దు
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ చక్కెరను త్వరగా జీర్ణం చేసుకోలేరు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పైనాపిల్ ను తినకుండా ఉంటే మంచిది. యాంటీబయాటిక్స్ తీసుకునేవారు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే పైనాపిల్ లో బ్రొమెలైన్ ఎంజైమ్ యాంటీబయోటిక్స్ ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. దీంతో ఆరోగ్యం దిగజారిపోతుంది. కనుక చలికాలంలో పైనాపిల్ ని ఎక్కువగా తినకుండా ఉంటేనే మంచిది. పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చలికాలంలో పైనాపిల్ జోలికి పోకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+