పాప్‌కార్న్ తింటున్నారా? అయితే జాగ్రత్త!
చాలామంది ఎంతో ఇష్టంగా పాప్ కార్న్ తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు కూడా పాప్ కార్న్ తినటాన్ని ఇష్టపడతారు. మొక్కజొన్నల నుంచి తయారు చేసే ఈ పాప్ కార్న్ లో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి ఇక పాప్ కార్న్ ఆరోగ్యకరమని ఎక్కడపడితే అక్కడ కనిపిస్తే కొనుక్కు తింటూ ఉంటారు.
పాప్ కార్న్ తినటం మంచిదా కాదా?
ముఖ్యంగా సినిమా థియేటర్లలో పాప్ కార్న్ కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పాప్ కార్న్ తినడం మంచిదేనా? ఒకవేళ తినాలి అనుకుంటే ఎటువంటివి తినాలి? వంటి వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. పాప్ కార్న్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నల నుంచి తయారయ్యే పేలాలలో పీచు పదార్థాలు, పాలి ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పాప్ కార్న్ తో ఆరోగ్యం
విటమిన్ బి కాంప్లెక్స్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్ మొదలైనవి అన్ని ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. పాప్ కార్న్ లో ఉండే పీచు పదార్థాలు మన రక్తనాళాలలో ఉన్న కొవ్వును సమర్థవంతంగా తగ్గించి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదం చేస్తాయి .వీటి కారణంగా గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
మార్కెట్ లో దొరికే ప్యాక్ పాప్ కార్న్ తింటున్నారా?
అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఇన్స్టెంట్ పాప్ కార్న్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. వీటిలో వెన్న, నూనె, రకరకాల మసాలాలు కలిపి రుచికరంగా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ తో ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక ఇటువంటి పాప్ కార్న్ తింటే ఖచ్చితంగా అనారోగ్యం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ప్రిజర్వేటివ్స్ తో ఆరోగ్యానికి హాని
ఇవి నిల్వ ఉండడం కోసం కలిపి ప్రిజర్వేటివ్స్ కారణంగా మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని వీటిని తరచూ తింటే ఆరోగ్యం కాదు అనారోగ్యం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇవి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయని, ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. మొత్తంగా పాప్ కార్న్ తిన్నా మంచిదే కానీ రకరకాల నూనెలతో, మసాలాలతో ప్యాక్ చేసిన వాటిని మాత్రం అస్సలు తినొద్దని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications