ప్రతి రోజు చియా గింజలు తింటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
చియా విత్తనాలు అద్భుతమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. వీటిని సూపర్ ఫుడ్‌గా కూడా చెబుతుంటారు. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మినరల్స్ వీటిల్లో అదికంగా ఉంటాయి. చియా విత్తనాల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా మంది రాత్రిపుట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటారు. కానీ, వీటిని పాలలో నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు.
చియా విత్తనాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి వృక్ష సంబంధమైనవి. అలాగే ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. కనుక శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా గుండె కండరాలు, రక్త నాళాలు వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చియా గింజలు తిన్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. ఎందుకంటే ఇది నీటిని గ్రహిస్తుంది. మొదటిసారి చియా విత్తనాలను తింటుంటే తక్కువ పరిమాణంలో తినడం మీ ఆరోగ్యానికి మంచిది. ఒక రోజులో 1 నుండి 2 చెంచాల చియా గింజలు మాత్రమే తీసుకోవాలి. చియా విత్తనాలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఇది కడుపుని ఎక్కువసేపు చల్లగా ఉంచుతాయి. అంతేకాకుండా, హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఉపయోగపడతాయి.

చియా గింజలు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడు తుంది. చియా గింజలు కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. అయితే, చియా విత్తనాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. చియా విత్తనాలంటే అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు. రక్తపోటు, మధుమేహ రోగులు వైద్యుడిని సంప్రదించకుండా చియా విత్తనాలను తినడం మంచిది కాదు. చియా విత్తనాలను నీటిలో లేదా పాలలో నానబెట్టకుండా తింటే గొంతు సమస్యలు వస్తాయి. నానబెట్టకుండా తింటే కడుపు ఉబ్బరం, పొట్టలో అసౌకర్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చియా విత్తనాలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.












Click it and Unblock the Notifications