ఆ మాంసం ఎక్కువ తింటే డయాబెటిస్ ముప్పు!
ప్రస్తుత సమాజంలో డయాబెటిస్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. డయాబెటిస్ మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిలా తయారైంది. ప్రస్తుత మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం అంటే అనేక కారణాలు మనలను డయాబెటిస్ బాధితులుగా మారుస్తున్నాయి. అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఎటువంటి కారణాలతో డయాబెటిస్ వస్తుంది అంటే.
డయాబెటిస్ రావటానికి ఈ ఆహారం కారణం
డయాబెటిస్ రావడానికి మనం తీసుకునే ఆహారం కూడా కారణమని అనేక అధ్యయనాలు తెలిపాయి. చాలామంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. రెడ్ మీట్ ను, ప్రాసెస్ చేసిన మీట్ ను తరచూ తినేవారు ఉన్నారు. అటువంటివారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డయాబెటిస్ ఏ ఆహారం తినేవారికి ఎక్కువ వస్తుందని 20 దేశాలలో 31 అధ్యయనాలు చేశారు.

రెడ్ మీట్ తినేవారిలో ఎక్కువ డయాబెటిస్ రిస్క్
ఆ అధ్యయనాలలో ప్రతిరోజు ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినేవాళ్ళల్లో డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మొత్తం 19.7 లక్షల మంది పైన డయాబెటిస్ పరీక్షలు నిర్వహించిన వారు ఈ పరిశోధనలో ప్రతిరోజు 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మీట్ తీసుకున్న వారిలో 15% డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేల్చారు.
అధ్యయనం తేల్చిందిదే
ఇక ప్రతిరోజు 100 గ్రాముల ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం తిన్న వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం మరో 10 శాతం పెరుగుతుందని తేల్చారు. ఇక అలాగే 100 గ్రాముల పౌల్ట్రీ మాంసం తినే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం మరో ఎనిమిది శాతం పెరిగిందని అధ్యయనంలో వెల్లడైంది. డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ప్రాసెస్ చేస్తున్న రెడ్ మీట్ ను తక్కువగా తినాలని సూచిస్తున్నారు.
ఈ మాంసం తినొద్దు
ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని 62% పెంచుతుందని అధ్యయనాలలో వెల్లడైనట్టుగా పేర్కొన్నారు. కనుక మాంసం ప్రియులు టైప్ టు డయాబెటిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసాన్ని తినకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications