కోడిగుడ్లను వీళ్లు అసలు తినద్దు..తింటే ఆసుపత్రికే..!!
కోడిగుడ్డు. ఆరోగ్యానికి మంచిది. కానీ, అందరికీ కాదు. కోడిగుడ్డు లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ప్రతీ రోజు ఒక కోడి గుడ్డు తినాలని చెబుతారు. అయితే, అసలు కొందరు ఈ కోడిగుడ్డు తినకూడదు. తింటే కొత్త సమస్యలు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోడిగుడ్డు వినియోగం పైన భిన్నా భిప్రాయాలు ఉన్నాయి. కోడిగుడ్డులో తెల్లని భాగం.. పచ్చ సొన వినియోగం గురించి చాలా మంది లో అపోహలు కనిపిస్తున్నాయి. అయితే.. కోడిగుడ్లను ఎవరు తినకూడదనే అంశం పైన వైద్యులు స్పష్టత ఇస్తున్నారు.
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో .. కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం కోడిగుడ్లకు దూరంగా ఉండాల్సిందే. గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు పొరపాటున కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువలన ఇది శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు కోడి గుడ్లు తినకపోవటం మంచిందని సూచిస్తున్నారు. అలర్జీలు ఉన్న వారు కోడిగుడ్లను తినకపోవడమే మంచిది. అలర్జీలు ఉన్నవారు అందరికీ గుడ్లు రియాక్షన్‌ను కలిగించకపోవచ్చు. ఫుడ్ అలర్జీ ఉన్నవారు కోడిగుడ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే కొందరికి కోడిగుడ్లను తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారుతుంది. సరిగ్గా జీర్ణం కాదు. పుల్లని త్రేన్పులు కూడా వస్తుంటాయి. వీరిలో కొందరికి విరేచనాలు లేదా మలబద్దకం కూడా కలగవచ్చు. కనుక ఇలాంటి లక్షణాలు కనిపించేవారు కూడా గుడ్లను తినకూడదు.

కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. కోడిగుడ్లలో ఉండే క్యాల్షియంను శరీరం శోషించుకుంటుంది. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కిడ్నీ స్టోన్లు లేని వారు కోడిగుడ్లను తినవచ్చు. అదే విధంగా, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు కూడా కోడి గుడ్లను తినకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎల్‌డీఎల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్.డాక్టర్ సూచన మేరకు వీరు గుడ్లను తినాల్సి ఉంటుంది. అలాగే హైబీపీ ఉన్నవారు కూడా డాక్టర్ సూచన మేరకే గుడ్డును తినాలి. కొందరికి రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి వారు గుడ్లను తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. టైఫాయిడ్ వచ్చి తగ్గినా కనీసం 15 రోజుల వరకు గుడ్లను ముట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఇలా ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లను అసలు తినకూడదు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications