గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటున్నారా...ఇది తెలుసుకోవాల్సిందే..!!
కోడిగుడ్లు. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. అయితే, చాలా మంది మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తారు. పదార్ధాలను ఫ్రిజ్ లో ఉంచి తినటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గుడ్ల విషయంలోనూ పలువురిలో అపోహలు ఉన్నాయి. ఫ్రిజ్ లో గుడ్లు ఎన్ని రోజుల ఉంచవచ్చు.. అసలు ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
సాధారణంగా ప్రతీ ఇంటా గుడ్లను ఫ్రిజ్ లో వినియోగించటం కనిపిస్తుంది. గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే, గుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు నిరూపించాయి. గుడ్లను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకు పోతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల గుడ్ల ద్వారా శరీరానికి లభించే ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, సాధ్యమైనంత వరకు గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకుండా ఉండటం మంచిది. తప్పనిసరి అయితే, చాలా తక్కువ సమయం మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలని సూచిస్తున్నారు.

ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్‌లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది. గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదు. నిల్వ చేసినా ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి స్టోరేజ్ చేయాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి. అప్పటి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన వరకు గుడ్లను తెచ్చుకొని వినియోగించటం ద్వారా పోషకాలు ఉంటాయని.. ఫ్రెష్ గుడ్లు వినియోగం పెరుగుతుందని చెబుతున్నారు. కాగా.. ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచకుండా.. అవసరం మేర వరకు వినియోగిస్తే సమస్యలు ఉండవని సూచిస్తున్నారు.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications