కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పై మరో గుడ్ న్యూస్- ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..!

దశాబ్దాలుగా గోదావరి జిల్లాల వాసులకు తీరని కలగా ఉన్న కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ (Kotipalli-Narasapur Railway Line) నిర్మాణానికి ఇవాళ మరో అడుగు పడింది. ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం (AP Govt ) తరఫున చెల్లించాల్సిన అదనపు నిధుల్ని ఇవాళ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రూ.100 కోట్లు రాష్ట్ర వాటాగా రైల్వే శాఖకు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ..! హైకోర్టు షాక్ పై సాయిరెడ్డి విశ్లేషణ..!
అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ..! హైకోర్టు షాక్ పై సాయిరెడ్డి విశ్లేషణ..!

కోటిపల్లి-నరసాపురం మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ కోసం కోనసీమ ప్రాంత ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 57.21 కి.మీ పొడవైన ఈ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు 2000-01లోనే మంజూరైంది. దీని అంచనా వ్యయం ప్రస్తుతం సుమారు ₹2,120 కోట్లకు చేరింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకు ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు. ఇది పూర్తయితే అమలాపురం, పేరూరు, పసర్లపూడి, జగ్గన్నపేట, రాజోలు వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ లభించనుంది. కోటిపల్లి-అమలాపురం మధ్య 12.70 కి.మీ, అమలాపురం-చించినాడ మధ్య 33.88 కి.మీ, చించినాడ-నరసాపురం మధ్య 10 కి.మీగా ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం గోదావరికి ఉన్న మూడు ఉప నదులు గౌతమి, వైనతేయ, వశిష్ఠపై వంతెనల నిర్మాణం.

AP Govt Sanctions 100 Crore for Kotipalli-Narasapur Railway Line
కేంద్రాన్ని అడ్డుపెట్టి చంద్రబాబుకు జగన్ సిసలైన సవాల్..! హైకోర్టు తీర్పుతో..!
కేంద్రాన్ని అడ్డుపెట్టి చంద్రబాబుకు జగన్ సిసలైన సవాల్..! హైకోర్టు తీర్పుతో..!

ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ట్రం 25 శాతం, కేంద్రం 75 శాతం భరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో తన వాటా మొత్తంలో 52.69 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించింది. ఇవాళ మరో 100 కోట్లు చెల్లించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే భూసేకరణ, సివిల్ పనుల్లో 25 శాతం వాటా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టుకు మొత్తం 421.35 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 162.52 హెక్టార్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన భూమిని కూడా ప్రభుత్వం అప్పగించనుంది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటూ అడుగులు వేస్తే త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+