బీచ్‌లో హద్దులు దాటేసిన నభా నటేష్.. అందాలతో ఇస్మార్ట్ భామ టెంప్టింగ్!

అందం, అభినయం ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయారు కన్నడ బ్యూటీ నభా నటేష్. కన్నడ, తెలుగు భాషల్లో నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ప్రమాదం బారినపడి జీవితంలో పెద్ద దెబ్బ తిన్నారు. అయినప్పటికీ గోడకి కొట్టిన బంతిలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరిగి హిట్ ట్రాక్ అందుకునేందుకు నభా నటేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తొలి చిత్రంతోనే కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌ కుమార్‌కు జోడీగా ఛాన్స్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు నభా. నన్ను దోచుకుందువటే‌తో మూవీతో తెలుగు వారిని పలకరించింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో నటించిన ఇస్మార్ట్ శంకర్ ఆమెకు తెలుగులో విజయంతో పాటు బ్రేక్ ఇచ్చింది. తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న దశలో విధి ఆమెను చిన్న చూపు చూసింది. ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేయడం, లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇది నభా జీవితంపైనా ప్రభావం చూపించింది.

Nabha Natesh s Latest Beach Vacation Photos Go Viral on Social Media Her Latest Photos Here

ఇదే సమయంలో ఓ యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాల పాలైన నభా నటేష్‌ మంచానికే పరిమితమయ్యారు. భుజానికి పెద్ద గాయమై, సర్జరీ వరకు పరిస్ధితి వెళ్లింది. ఈ ప్రమాదం ఆమె సినీ జీవితానికి బ్రేకులు వేసింది. అనారోగ్యం కారణంగా మంచి ప్రాజెక్ట్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గానూ చాలా కుంగిపోయాను. అయితే నాలో ఓర్పు, పోరాడే శక్తి కూడా వచ్చాయని నభా పేర్కొన్నారు.

అయితే ఇప్పటికీ కూడా నభా నటేష్‌ను ఆ ప్రమాదం వెంటాడుతూనే ఉంది. గాయం తాలూకా మచ్చలు అలాగే మిగిలిపోయాయి. హీరోయిన్లకు అందమే కీలకం.. తమ శరీరంలోని లోపాలను వారు బయటకు కనిపించనివ్వరు. అలాంటిది నభా మాత్రం కుంగిపోకుండా ఆ మచ్చలతోనే ఫోటో షూట్‌లో పాల్గొనడం ఆమె ధైర్యానికి, వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ ఏడాది నాగబంధం సినిమాలో నభా నటించారు. ఈ సినిమా ద్వారా గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.

ప్రస్తుతం నిఖిల్ సరసన చేస్తున్న స్వయంభు ఒక్కటే ఆమె చేతిలో ఉంది. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోన్న స్వయంభుని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సీజీ వర్క్స్, వీఎఫ్ఎక్స్ పెండింగ్ పడటంతో స్వయంభు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నభా నటేష్ తన సినిమాలు, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. తాజాగా నభా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో వెకేషన్‌కు వెళ్లిన నభా నటేష్ మోడ్రన్ డ్రెస్‌ ధరించి ఎద అందాలు, ఒంపు సొంపులు చూపిస్తూ సెగలు రేపుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం నభా అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+