రోజూ నడకతో ఎన్నో లాభాలు- ఈ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి..!!
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిత్యం నడక అలవాటుగా మార్చుకుంటే శరీరంలోని ఎన్నో భాగాలకు ప్రయోజనం కలుగుతుంది. శరీరంతో పాటుగా మనసును ఉల్లాసంగా ఉంచే అతి తేలికైన వ్యాయామం నడక. వయసుతో నడకకు ఎలాంటి సంబంధం లేదు. మధుమేహం.. రక్తపోటు.. మానసిక ఆందోళన వంటి ఎన్నో సమస్యలకు నడక మేలు చేస్తుంది. వైద్యులు సైతం రోజు నడక పైన పలు సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తల పైన అవగాహన అవసరం. ఎంత సేపు నడవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచిస్తున్నారు.
నిత్యం నడక అలవాటుగా మార్చుకోవటం ఆరోగ్యానికి మేలు చేసే నిర్ణయం. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే.. తొలుత చిన్నగా.. తక్కువ సమయం నడక ప్రారంభించి.. క్రమేణా పెంచటం ఉత్తమైన మార్గం. వైద్యులు సమయం ఎంపికలో వారి శరీర సమస్యలకు అనుగుణంగా సూచనలు అందిస్తున్నారు. నడక ద్వారా ప్రతీ ఒక్కరిలోనూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా నడక సమయంలో శరీరంలో ఫీల్ గుడ్ ఎండార్పిన్లు విడుదల ద్వారా మనసు ఉల్లాసంగా ఉంటుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటుగా రోగ నిరోధకశక్తి పెరుగుతుందని వెల్లడించాయి. వాకింగ్ చేయడం వల్ల ఎముకలు గట్టి పడటం.. కండర శక్తి పెరుగటం వంటి ప్రయోజనగాలు ఉన్నాయి. ఇక.. నడక ద్వారా గుండె కు రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నడక సమయంలో శరీరానికి పట్టే చెమట కారణంగా శరీరంలోని వ్యర్ధాలు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. సరైన నడక విధానంతో మధుమేహం.. బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ సాధ్యపడుతుంది. ఇదే సమయంలో.. వాకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. మూడు కిలో మీటర్ల నడక వరకు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. అంతకు మించి నడిస్తే దానికి మోడరేట్ వాక్ గా పిలుస్తారు.
దీని ప్రారంభానికి ముందు శరీరానికి కొంత వ్యాయామం అవసరమని సూచిస్తున్నారు. అదే విధంగా జాగింగ్ చేసే వాు సైతం ముందుగా వ్యాయామం చేయటం తప్పని సరి చేసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకే నడక సమయం.. దూరం ఖరారు చేసుకోవటం మంచింది. 45 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రం వైద్యులతో సంప్రదించిన తరువాతనే నడక ప్రారంభించటం అవసరం. నడుస్తున్న సమయంలో నీరసం.. అలసట, కళ్లు తిరగటం లాంటి లక్షణాలు కనబడితే వెంటనే ఆపేసి వైద్యుడిని సంప్రదించాలి. ఇలా.. నడక ఎంత మంచిదో.. జాగ్రత్తలు అంతే అవసరం.












Click it and Unblock the Notifications