విపరీతమైన అలసట, కాళ్ళ మంటలు.. మీకీ సమస్య ఉన్నట్టే... జాగ్రత్త!
చాలామంది చిన్న పని చేసినా అలసిపోతుంటారు. అరికాళ్ళు మంటలు, నొప్పులు అంటూ తెగ బాధ పడుతూ ఉంటారు. చేతులు, కాళ్లు తిమ్మిరి వచ్చిందని, విపరీతంగా మరిచిపోతున్నాం అని తెగ బాధపడుతూ ఉంటారు. అయితే అటువంటి వారు ఖచ్చితంగా కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఉన్న లోపాలను తెలుసుకొని, మన శరీరంలో విటమిన్ లోపాలు అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త
చాలామందికి కాళ్లు చేతులు తిమ్మిర్లు గా ఉండడం, సూదులతో పొడిచినట్టు నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్య విటమిన్ బి 12 లోపం వల్ల వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కంట్రోల్ లో లేనివారిలోనూ ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ప్రధానంగా నరాలకు సంబంధించిన సమస్యను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

ప్రతీదానికి అలసట ఫీల్ అవుతున్నారా?
ఎవరైనా అరికాళ్ళలో, చేతులలో మండుతున్నట్టు అనిపిస్తే దానిని విస్మరించకూడదు అని వైద్యులకు చూపించవలసిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. చేతులకు, కాళ్లకు ఎటువంటి గాయాలు కాకుండా మంటగా అనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని చెబుతున్నారు. అంతేకాదు విటమిన్ బి12 లోపం కారణంగా చాలామంది నడుస్తున్నప్పుడు తడబడతారని చెబుతారు. కంటి నిండా నిద్ర పోయినా కూడా ఇంకా అలసటగానే ఉంటుందని, చిన్న చిన్న పనులు చేసి కూడా అలసిపోయినట్లు ఫీలవుతారని చెబుతున్నారు.
బలహీనంగా, పాదాలు చల్లబడుతూ ఈ లక్షణాలు ఉంటేసమస్య అదే
ఈ పరిస్థితులు దీర్ఘకాలికంగా కొనసాగితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల పాదాలు చల్లగా ఉంటాయని చెబుతున్నారు. చాలా బలహీనంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, కళ్లు తిరగడం, చర్మ సమస్యలు, అలసట, గుండె దడ, ఏకాగ్రత లేకపోవడం వంటి అనేక సమస్యలు విటమిన్ బి12 లోపం వల్ల వస్తుందని చెబుతున్నారు.
విటమిన్ బీ 12 లోపాన్ని అసలే నిర్లక్ష్యం చెయ్యొద్దు
విటమిన్ బి 12 లోపం ఉంటే పాదాలు పసుపు రంగులోకి మారుతాయని చెబుతున్నారు. పాదాలలో రక్త ప్రవాహం నిదానిస్తుందని ఫలితంగా నొప్పులు, సూదులతో గుచ్చినట్టు పోటు ఇబ్బంది పెడతాయని చెబుతున్నారు. కనుక విటమిన్ బీ 12 లోపాన్ని అసలే నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆహారంలో పుష్కలంగా విటమిన్ బీ 12 ఉండేలా చూసుకోవాలి, సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications