కళ్ళవాపు, నొప్పి... ఆర్థరైటిస్ తో సంబంధం!

ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు ఉన్నా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే అది ఏమాత్రం మంచిది కాదు. ఇక ఆర్థరైటిస్ ఉంటే శరీర భాగాలలో వాపు, నొప్పి దీర్ఘకాలికంగా కలుగుతుంది అనే విషయం ప్రతి ఒకరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆర్థరైటిస్ ను నిర్లక్ష్యం చేయటం డేంజర్ అని తెలుసుకోవాలి.

ఆర్థరైటిస్ తో కంటి సమస్యలు
ఆర్థరైటిస్ ప్రధానంగా చేతులు, కాళ్లు, మణికట్టు, పాదాలు వంటి శరీరంలోని కీళ్ళను ప్రభావితం చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ కొన్నిసార్లు ఇది కళ్ళతో సహా ఇతర శరీర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్థరైటిస్ కళ్ళను చాలా దారుణంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారు కంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు.
ఇది ఎముకల చివరలను కప్పి ఉంచే బంధన కణజాలాన్ని దెబ్బతీస్తుంది.

Eye swelling pain linked to arthritis

ఆర్థరైటిస్ తో డ్రై ఐ సమస్య
ఈ బంధన కణజాలం ఎక్కువగా కొలాజిన్ అనే పదార్థంతో తయారవుతుంది. ఇక ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారు చాలామంది కళ్ళు పొడిబారుతున్న సమస్యలను ఎదుర్కొంటారు. ఇది పురుషులతో పోల్చుకుంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనిని చికిత్స చేయకుండా వదిలేస్తే డ్రై ఐ సమస్య అసౌకర్యంగా ఉండటమే కాకుండా ఇన్ఫెక్షన్లు మరియు కార్నియల్ మచ్చలకు దారితీస్తుంది.

ఆర్థరైటిస్ ను కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఆర్థరైటిస్ తో బాధపడే వారిలో కళ్ళ వాపు విపరీతమైన నొప్పి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇది దృష్టి సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన కంటినొప్పిని కలిగిస్తుంది. వెలుగును చూడలేనంత సున్నితంగా కంటిని మారుస్తుంది. కాబట్టి ఆర్థరైటిస్ తో బాధపడేవారు కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఒక్కోసారి ఆర్థరైటిస్ కారణంగా గ్లోకోమా సమస్యతో కూడా బాధపడే ప్రమాదం ఉంటుంది.

చూపు కోల్పోయే ప్రమాదం.. తస్మాత్ జాగ్రత్త
కంటిపైన విపరీతమైన ఒత్తిడి పెరిగి కంటి నరాలు దెబ్బతింటాయి. ఆప్టిక్ నరాలు దెబ్బ తినడం వల్ల దృష్టి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి చూపు కోల్పోయే ప్రమాదం వస్తుంది. కనుక ఆర్థరైటిస్ బాధితులు కళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నేత్ర వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడం మాత్రమే కాకుండా ఆర్థరైటిస్ ను కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా మందులు వాడాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+