డయాబెటిస్ ఉన్నవారికి దివ్యౌషధం.. ఇదొక్కటి తింటే చాలు..!
మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవలి కాలంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో ఏటేటా కేసులు అధికం అవుతున్నాయి. ఈ రోజుల్లో చిన్నా పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక దేశంలో 10 కోట్లకు పైగా మధుమేహ బాధితులు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో వైద్యుల సూచనల మేరకు ప్రజలు పలు ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం తినాలి.. ఏం తినకూడదు అన్న దానిపై స్పష్టత ఉండాలని సూచనలు చేస్తున్నారు. అయితే డయాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్లకు మెంతులు దివ్యౌషధం అని వైద్యులు చెబుతున్నారు.
మెంతులు.. మధుమేహం, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు.. ఇలా అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయని వైద్యులు వివరిస్తున్నారు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇక మెంతుల నూనె కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని.. అలాగే మెంతులు బరువు తగ్గడానికి సహాయపడతాయని వైద్యులు వివరిస్తున్నారు.

డయాబెటిస్ రోగులు.. రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడానికి మెంతి పొడి లేదా మెంతి నీటిని తీసుకోవచ్చుని వైద్యులు చెబుతున్నారు. ఇక 4 నుంచి 6 నెలల పాటు ప్రతిరోజూ 10 గ్రాముల మెంతులు తీసుకోవడం వల్ల HbA1c తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. ఇతర ప్రయోజనాలను ఓసారి చూస్తే.. మెంతులను నేతిలో వేయించి, కొద్దిగా సైందవ లవణాన్ని కలిపి మజ్జిగలో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయట. అలాగే మెంతులతో తయారు చేసిన 'టీ' ని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications