నలభై దాటాక నిత్య యవ్వనం ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి!
నాలుగు పదుల వయస్సు వచ్చేసరికి వయస్సు అయిపోతుంది అనే భావనలో మీలో వస్తుంది. ఆ భావనతోనే మీపట్ల మీరు అశ్రద్ధ చూపిస్తుంటారు. కానీ అసలైన యవ్వనం నలబైలోనే మొదలౌతుంది. ఆహార విషయంలో నియమాలను ఈ వయస్సు నుండే పాటించాలి. అతిగా కాకుండా మితంగా పౌష్టికాహారం తినాలి. అది కూడా సమయానికి తినాలి.
నలభై దాటాక ఇవి చెయ్యాల్సిందే
ఈ వయస్సులో శరీరానికి వ్యాయామం చాలా అవసరం. నాలుగు పదుల వయస్సు అనేది కాలానికి సంఖ్య మాత్రమే అది మీ శరీరానికి కాదు అనే భావన మీలో ఉండాలి. అప్పుడే మీరు మీలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. ప్రతి కుటుంబంలో ఈ వయస్సులోనే ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల జీవితాలు చక్కబెట్టాలి అనే ఆలోచనలు ఇలా అనేకమైన ఆలోచనలు ప్రతి ఒక్కరిలో నలబైఏళ్ళు దాటిన నుండే మొదలౌతాయి.

మీ బాడీ ఫిట్ గా ఉండాలంటే ఇలా చెయ్యండి
మీరు చేసే పని మీద ద్యాస వున్న మీ మెదడు అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటుంది. వీటన్నింటినీటిని వదిలి మీ మనస్సును మీ అధీనంలోకి తెచ్చుకోవడానికి,మీరు ఉత్సాహంగా ఉండడానికి మీకు రోజు మినిమం ఒక గంట కచ్చితంగా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇలా క్రమం తప్పకుండా రోజు వ్యాయామం చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ బాడీ కూడా ఫిట్ గా కూడా ఉంటుంది. అప్పుడే మీరు యవ్వనంగా కనిపిస్తారు.
యవ్వనంగా కనిపించడానికి అన్నింటికంటే ఇది ముఖ్యం
అనేక మందిలో ప్రతి రోజు వెంటాడుతున్న అతి భయంకరమైన సమస్య నిద్ర లేమి. ఈ సమస్య ఉన్నవారు అనేక రోగాలతో ఇబ్బంది పడతారు. తెలిసి తెలిసి ఇలాంటి సమస్యలను మనమే కొనితెచ్చుకుంటున్నాం. నిద్రలేమి సమస్య ఉన్నవారు అసలే యవ్వనంగా ఉండలేరు. తొందరగా వయస్సు మీద పడిన వారి లాగ కనిపిస్తుంటారు..
ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
ఆరోగ్య వంతమైన జీవితానికి ప్రతి మనిషికి నిద్ర ఒక వరం లాంటిది. కంటి నిండా నిద్ర పోయేవారికి అంటే కనీసం ఏడు గంటల నుండి ఎనిమిది గంటలు పడుకునేవారికి ఒంట్లో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా మాయమైపోతాయి. నిద్ర బాగా పోయేవారు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. యవ్వనంగా కూడా ఉంటారు. కనుక నిద్ర విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.
ప్రేమలో పడిన వారు జీవితకాలం యవ్వనంగా ఉంటారు
ప్రేమ అని చెప్పడానికి రెండు అక్షరాలే కానీ ఈప్రేమలోనే జీవితం ఉంటుంది. కష్టం సుఖం ఈ రెండు అక్షరాలలోనే ఉంటుంది. అదే ప్రేమలో తల్లి దండ్రులను ప్రేమించండి,మీ పిల్లలను ప్రేమించండి ,మీ జీవిత భాగస్వామినీ ప్రేమించండి. సాటి మనుషులను ప్రేమించండి. ఆ ప్రేమలోనే సంతోషాన్ని వెతుక్కొండి. ఆ సంతోషమే మీ ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లాగ పనిచేస్తుంది.
ప్రేమతో యవ్వనం
అనేక పరిశోధనలో తేలిన విషయం చాలా మంది నిపుణులు చెప్పిన మాటల ప్రకారం ప్రేమగా అన్యోన్యంగా ఉన్న దంపతులు ఎక్కువ కాలం జీవించారు అని, వారు ఎల్లపుడు యవ్వనంగా కనిపించేవారని చెప్తారు. అందుకే కోపాలు, చిరాకులు పక్కన బెట్టి ప్రేమమయ జీవనాన్ని గడిపితే యవ్వనంగా, ఉత్సాహంగా ఉంటారు.
ప్రతి మనిషిలో కాస్త కళ పోషణ ఉండాలి
మనుషుల్లో బొత్తిగా కళా పోషణ తగ్గిపోతుంది. ఒకప్పుడు కళలకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనిషి సంతోషంగా జీవించాలంటే కళల పట్ల, తమకు ఉన్న అభిరుచుల పట్ల ఆసక్తితో వాటికి కూడా సమయం కేటాయించాలి, ఇవి మనకు కావాల్సిన మానసిక ఉల్లాసాన్ని ఇచ్చి మనలను ప్రశాంతంగా జీవించేలా చేస్తాయి. కనుక నిత్య యవ్వనం ఉండాలంటే పైన పేర్కొన్నవి పాటించి చూడండి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications