రాత్రుళ్ళు అసలే నిద్రపోలేకపోతున్నారా? ఇలా చేస్తే మీకు సుఖమైన నిద్ర!
ఇటీవల కాలంలో నిద్రలేమి సమస్య చాలా తీవ్రమైన సమస్యగా మారింది. పగలంతా పనిచేసినప్పటికీ రాత్రి పడుకుంటే నిద్ర పట్టకపోవడం అనేది చాలామంది జీవితాల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే దీనికి ఒత్తిడి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత బాధ్యతలు, వృత్తిలో ఉన్న డెడ్లైన్లు, వేగవంతమైన జీవనశైలి కారణంగా విపరీతమైన ఒత్తిడి బారిన పడుతున్నారు.
ఒత్తిడి వల్లే నిద్రలేమి... ఇలా చేస్తే సమస్యకు చెక్
ఈ క్రమంలోనే ఒత్తిడి నిద్ర లేమి సమస్యలు కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ఒత్తిడిని జయించి ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ఏం చేయాలి అనేది నిపుణులు చెబుతున్నారు. .ప్రశాంతంగా నిద్ర పోవాలని భావించేవారు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బ్రీత్ ఎక్ససైజ్ చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చని చెబుతున్నారు.

శారీరక వ్యాయామంతో నిద్రలేమి సమస్యకు పరిష్కారం
నాలుగు సెకండ్ల పాటు గాలిని లోపలికి పీల్చి ఏడు సెకండ్ల పాటు శ్వాసను ఆపి ఆ తర్వాత ఎనిమిది సెకండ్ల పాటు శ్వాసను బయటకు వదలటం చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. ఇక వ్యాయామం చేయడం వల్ల కూడా ఒత్తిడి హార్మోన్ అయిన కార్టీసాల్ తగ్గుతుందని ఎండార్పిన్ హార్మోన్ విడుదల చేయడానికి శారీరక వ్యాయామం ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. శారీరకవ్యాయామం అలవాటు చేసుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
ధ్యానంతో సూపర్ ప్రయోజనం
శరీరక వ్యాయామం విశ్రాంతిని ప్రోత్సహిస్తుందని ఫీల్ గుడ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇక ఒత్తిడిని జయించి ప్రశాంతంగా నిద్ర పోవాలంటే ధ్యానం చేయడం ఎంతో ఉత్తమమని సూచిస్తున్నారు. ధ్యానం చేసే వారిలో కూడా ఒత్తిడి తగ్గుతుందని ఫలితంగా ప్రశాంతమైన నిద్ర వస్తుందని చెబుతున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే ప్రకృతిలో తిరిగి కనెక్ట్ అవ్వడం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
ఒత్తిడికి ప్రకృతి మంత్రం
బయట కొద్దిసేపు సమయం గడపడం ఒత్తిడికి సమర్థవంతమైన విరుగుడుగా చెబుతున్నారు. మనసుకు ఇష్టమైన పని చెయ్యటం కూడా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ప్రశాంతమైన మానసిక స్థితిని కలిగించి నిద్ర పట్టేలా చేస్తుందని చెబుతున్నారు. కనుక ఒత్తిడితో నిద్రపోలేకపోతున్నవారు తప్పనిసరిగా ఒత్తిడి జయించేందుకు పైన వైద్య నిపుణులు పేర్కొన్న చిట్కాలను పాటిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications