చర్మ సౌందర్యాన్ని పెంచే కొల్లాజెన్ పుష్కలంగా ఉండే ఆహారాలివే!
యవ్వనంగా ఉండాలని, అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. ప్రతి ఒక్కరు చర్మ సౌందర్యంతో అందంగా ఉండాలని కోరుకుంటారు. అటువంటివారు చర్మ సౌందర్యానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోవాలి. మన చర్మం నివారింపును సంతరించుకోవాలంటే యవ్వనంగా కనిపించాలంటే చక్కని మెరుపును సొంతం చేసుకోవాలంటే కొల్లాజెన్ ఎంతో అవసరం.
కొల్లాజెన్ పుష్కలంగా ఉండే ఆహారాలు
ఇది మన చర్మాన్ని వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. వృద్ధాప్యం రాకుండా అనేక సౌందర్య సాధనాలను మనం ఉపయోగిస్తాం కానీ వాటికంటే సమతుల్యమైన ఆహారం, కొల్లాజెన్ పోషకాలతో ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది. అటువంటి ఆహారాలలో కొన్ని ఆహారాలను మనం తెలుసుకుందాం.

అవకాడో
అవకాడో పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. అధిక సల్ఫర్, జింక్ కూడా ఉంటాయి. ఇది కొల్లాజన్ విచ్ఛిన్నతను నివారించడంలో సహాయపడుతుంది మన స్కిన్ టోన్ ను నిర్వహిస్తుంది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది.
డ్రై ఫ్రూట్స్
బాదంపప్పు, వాల్నట్, జీడిపప్పు, అవిసె గింజలు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి, కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిని నిత్యం మనం ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం ముడతలు రాకుండా ఉంటుంది.
ఆకుకూరలు, బ్రోకలీ
బచ్చలి కూర బ్రోకలీ వంటి క్లోరోఫిల్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి చర్మం యొక్క స్థితిస్థాపకతను పెంచి ముడతలను నివారిస్తాయి.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రో కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది కొల్లాజెన్ గ్రహించే శరీర సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
టమాటాలు, గుడ్లు
టమాటాలలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. కొల్లాజన్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని అందించి రక్షిస్తుంది. అంతేకాదు కోడిగుడ్లలో కూడా సల్ఫర్, ప్రోలిన్ అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతునిస్తాయి. మన చర్మ ఆరోగ్యాన్ని రక్షించడానికి దోహదం చేస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications