బరువు తగ్గాలంటే ఉదయం ఈ పనులు తప్పక చెయ్యండి!
ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. ఇక ప్రస్తుతం సమాజంలో ఆరోగ్యం నిజంగానే మహాభాగ్యంగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళు ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఊబకాయం సమస్య మనుషులను రోగాలపాలు చేస్తుంది. విపరీతంగా బరువు పెరిగి, ఫలితంగా అనేక రోగాలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే అటువంటివారు బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఏం చేయాలి? ఏ పనులతో మనం బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే ఇవి చెయ్యండి
ఇక బరువు తగ్గాలనుకుంటున్న వారు ఉదయం చేసే దినచర్య బరువు తగ్గడానికి ఒక గొప్ప మార్గంగా చెప్పవచ్చు. ఎవరైతే బరువు తగ్గాలని గట్టి ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ముఖ్యంగా తెల్లవారుజామున 5 పనులు చేయాలి. ఈ ఐదు పనులను క్రమ పద్ధతిలో ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. ప్రతి ఒక్కరూ సమయానికి నిద్రలేవాలి. బరువు తగ్గాలనుకునేవారు నిర్దిష్ట నిద్ర సమయాన్ని కేటాయించుకోవాలి.

ఉదయం నిద్ర లేచాక ఇవి చెయ్యండి
సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్ర లేవడం బరువు నిర్వహణకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లను తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియలు వేగవంతంగా మారి అవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి.
ఉదయం ఈ పనులతో బరువుకు చెక్
బరువు తగ్గాలి అని భావించేవారు ఉదయం అల్పాహారాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఆరోగ్యవంతమైన అల్పాహారాన్ని తీసుకోవాలి ఇక అల్పాహారాన్ని కూడా మితంగా తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని అల్పాహారంగా చేసుకుంటే మంచిది. బరువు తగ్గాలని భావించేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉదయం దినచర్యలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలి. జాగింగ్, యోగ, బ్రిస్క్ వాకింగ్ వంటివి చెయ్యాలి. ఉదయాన్నే వ్యాయామం చేయడం బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
ఇవి చెయ్యండి.. ఈజీగా బరువు తగ్గుతారు
అంతేకాదు ప్రశాంతతను అలవాటు చేసుకోవడానికి మెడిటేషన్ చేయాలి. బరువు తగ్గడంలో మెడిటేషన్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఒత్తిడితో బరువు పెరుగుతారు. అందుకే ఒత్తిడిని తగ్గించి బరువును నియంత్రించడానికి మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరం. ధ్యానం ఒత్తిడి స్థాయిలను తగ్గించి హార్మోన్లను సమతుల్యం చేయడానికి దోహదం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఎవరైతే ఈ పనులు నిర్దిష్ట సమయంలో చేస్తారో వారు కచ్చితంగా బరువు తగ్గుతారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications