లెమన్ టీలో ఇవి కలిపితే.. టేస్ట్ వేరే లెవెల్
లెమన్ టీని ఇష్టపడని వారెవరూ ఉండరు. టీ తాగే ప్రతి ఒక్కరూ దీని టేస్టుకు సలాం కొట్టాల్సిందే. ఇందులో అల్లం వంటివి కలుపుకొంటే రుచి మరింత పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి వాటికి ఓ చక్కటి హోమ్ రెమెడీ. శ్వాసనాళ ఇన్ఫెక్షన్ల తగ్గడంలో అల్లం సహాయపడుతుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పి, బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు కూడా ఎంతో ప్రభావం చూపుతుంది.
అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జలుబు నుండి ఉపశమనం పొందడానికి, బ్యాక్టీరియా, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో అల్లాన్ని అత్యంత ముఖ్యమైన మూలిక పరిగణిస్తారు. ఆయుర్వేద వైద్యులు అల్లాన్ని శక్తివంతమైన జీర్ణ సహాయకారిగా సూచిస్తారు. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఫలితంగా సకాలంలో ఆకలి వేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

లెమన్ టీలో అల్లం, శొంఠి, పుదీనా, తేనె వంటివి వేస్తే మరింత టేస్టీగా మారుతుంది. వీటిని కలిపిన లెమన్ టీ తాగడం వల్ల అటు ఆరోగ్యానికి కూడా మంచిదే. అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్న అల్లాన్ని ఎలా ఉపయోగించాలో, వీటిని కలిపిన లెమన్ టీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్- అల్లం టీ
అల్లం- లెమన్ టీ సేవించడం వల్ల కెఫిన్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు లేకుండా కెఫిన్ తీసుకున్నంత తాజాగా, ఉత్సాహంగా శరీరాన్ని ఉంచుతుంది.
తయారీ విధానం..
దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో నాలుగున్నర కప్పుల నీటిని తీసుకోవాలి. దాన్ని మరిగించాలి. నీరు మరిగేటప్పుడు అందులో అల్లం ముక్క వేయాలి. ఆ సమయంలోనే కొన్ని తులసి ఆకులను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను మరిగే నీటిలో వేసి, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కలపాలి. 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించాలి. టీని కప్పుల్లో వడకట్టాలి. రుచి కోసం ఓ టేబుల్ స్పూన్ నిమ్మరసం, బెల్లం కలపాలి. వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
అల్లం రసం- తేనె
అల్లాన్ని దంచి రసం తీయాలి. దాన్ని ఓ గ్లాసు/పాత్రలో వడపోయాలి. దీన్ని అయిదు నుండి ఆరు రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని రెండు టేబుల్ స్పూన్ల తేనెతో కలిపి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సేవించాలి. దీనివల్ల జీర్ణక్రియ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.
పుచ్చకాయ అల్లం పుదీనా కూలర్
ఒక పుచ్చకాయలో పావు వంతు తీసుకుని, తొక్క తీసి, గింజలు తీసేయాలి. దాన్ని ముక్కలుగా కోసి, బ్లెండర్ జార్‌లో పిండాలి. ఒక అల్లం ముక్క, 1/4 కప్పు పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. అన్నింటినీ కలిపి బ్లెండ్ చేసి, ఆపై స్ట్రైనర్ ద్వారా వడకట్టి తాగాలి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications