హెయిర్ కలర్ వేస్తున్నారా.. ఈ ఆరోగ్య నష్టాల గురించి తెలుసా?
ప్రస్తుతం చిన్న వయసులో ఉన్నవారికి కూడా జుట్టు తెల్లగా మారుతుంది. పోషకాహార లేమితో చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు నెరిసిపోతుంది. ఇక దీనిని కవర్ చేసుకోవడానికి చాలామంది హెయిర్ కలర్ ఉపయోగిస్తున్నారు. ఈ హెయిర్ కలర్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యం పాడవుతుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు అసలు హెయిర్ కలర్ వాడితే వచ్చే ఆరోగ్యప్రమాదాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
హెయిర్ కలర్స్ వాడితే ఈ ఆరోగ్య నష్టాలు
హెయిర్ కలర్ వాడడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టులోని ప్రొటీన్లు, లిపిడ్లు దెబ్బతిని, జుట్టు పొడిబారి, జుట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు రసాయనాలతో కూడిన హెయిర్ కలర్స్ తో చర్మం చిరాకుకు గురవుతుంది. తీవ్రమైన అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. హెయిర్ కలర్ వాడడం వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

హెయిర్ కలర్స్ వాడటంతో క్యాన్సర్ ప్రమాదం
కొన్ని రకాల హెయిర్ కలర్స్ వాడటం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. హెయిర్ కలర్స్ తో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ కలర్ లో అమోనియా వంటి రసాయనాలను వాడడం వల్ల వాటి ప్రభావం శ్వాస కోశం పైన పడుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే ప్రమాదం కనిపిస్తుంది.
గర్భ ధారణ సమయంలో జాగ్రత్త
హెయిర్ కలర్స్ వాడడం వల్ల దీర్ఘకాల అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా వస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం హెయిర్ కలర్స్ ను వాడటం వల్ల మూత్రాశయ క్యాన్సర్ వస్తుంది. నాన్-హాడ్కిన్స్ లింఫోమా వంటి క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉండవచ్చు. అంతేకాదు గర్భధారణ సమయంలో హెయిర్ కలర్ వాడకాన్ని నివారించవలసిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు.
హెయిర్ కలర్ వాడాలంటే ఇవి ఎంచుకోవాలి
గర్భధారణ సమయంలో హెయిర్ కలర్స్ వాడితే కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా హెయిర్ కలర్స్ వాడకం మంచిది కాదు. ఇక తప్పనిసరిగా వాడవలసి వస్తే అమోనియా లేని హెయిర్ కలర్స్ ని ఎంచుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications