జుట్టు తెగ ఊడిపోతుందా? ఇది ట్రై చేస్తే జుట్టు రాలే సమస్య నుండి రిలీఫ్!!

చాలామంది జీవనశైలి కారణాలతో, విపరీతంగా పెరిగిన ఒత్తిడితో, కాలుష్యం వంటి కారణాలతో జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలే సమస్య తీవ్రంగా ఉన్నవారు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ను ఉపయోగిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. అయినప్పటికీ జుట్టును కాపాడుకోలేక పోతున్నామని తెగ బాధపడుతున్నారు.

ఇక అటువంటి వారు మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు ఊడిపోయే సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ ప్యాక్ ను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

Hair loss? Try this remedy and get relief from hair loss problem!

దీనికోసం చేయవలసిందల్లా బాగా పండిన అరటిపండ్లను తీసుకొని అరటి పండ్లు బాగా గుజ్జుగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్టును మాడు నుంచి కురుల వరకు పట్టించి, ఒక అరగంటసేపు ఆరనిచ్చి ఆపై తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపు సొంతం చేసుకోవడమే కాకుండా, అరటి పండులో ఉండే క్యాల్షియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

అవసరమైన పోషకాలను అందించటానికి కూడా అరటిపండు సహాయపడుతుంది. అరటిపండు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.జుట్టు రాలిపోయే వారు చుండ్రు సమస్యను, జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి పెరుగులో అరటిపండు కలిపి తలకు పట్టించి, ఒక అరగంట సేపు అలానే ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి.

పెరుగు అరటిపండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రును మరియు చుండ్రు వల్ల కలిగే దురదలను, జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి, చుండ్రు వల్ల కలిగే దురదల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు అరటి పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు జుట్టుకు సహజ కండిషనర్ గా పనిచేస్తాయి. మృదువుగా మారుస్తాయి.

ఇక అరటిపండును నిత్యం మనం ఆహారంలో భాగంగా తీసుకున్నా , జుట్టు సమస్యల పరిష్కారం కోసం తలకు బాగా పట్టించినా మంచి ఫలితమే ఉంటుంది. జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకునేవారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+