రోజుకో Walnut.. మీ ఆరోగ్యానికి వాల్
వాల్‌నట్‌లు అధిక ధర కలిగిన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. అందుకే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. ధర ఎక్కువైనా, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో అత్యుత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్‌లో అపారమైన పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. రోజూ రెండు నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం గుండె, మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాల్‌నట్‌లల్లో కొన్ని రకాల హెల్తీ ఎంజైమ్‌లు ఉంటాయి. నానబెట్టిన తర్వాత మాత్రమే అవి శరీరానికి ఉపయోగపడతాయి. అందుకే, డ్రై ఫ్రూట్స్‌ను తినే ముందు రాత్రంతా నానబెట్టి తినడం మంచిది. నానబెట్టిన తర్వాత కూడా వాటిలో ఉండే పోషకాల గుణం మారదు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి రెండు వాల్‌నట్‌లు తినే అలవాటు చేసుకుంటే, చిన్న వయసులోనే యువకులలో కనిపించే వృద్ధాప్య ఛాయలను నివారించి, ముఖ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు అద్భుతమైన వనరు వాల్ నట్. ఇది మన మెదడు కణాలకు చాలా అవసరం. ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్‌లు తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయి. ఇది విద్యార్థులు వృద్ధులకు ఒక వరం లాంటిది. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమే కాకుండా, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా సహాయపడతాయి.
మధుమేహం, మలబద్ధకం సమస్య ఉన్నవారికి నానబెట్టిన వాల్‌నట్‌లు అధిక ఫైబర్‌ను అందిస్తాయి. ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. తద్వారా షుగర్ స్థాయి పెరుగుదలను నిరోధిస్తుంది. వాల్‌నట్‌లలో మంచి కొవ్వులు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అలాగే, వాటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును బలోపేతం చేసి, మెరిసేలా చేస్తాయి. ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. నానబెట్టిన వాల్‌నట్‌లు తినడం వృద్ధాప్యంలో ఎముక సమస్యలను నివారించడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు.. 2 నుండి 4 వాల్‌నట్‌ల పై పొరను తీసివేసి, వాటిని నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో, నీటి నుండి తీసి, వాటిని అలాగే నమిలి తినండి.












Click it and Unblock the Notifications