ఈ మసాలా దినుసులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు!
మన నిత్యజీవితంలో ఉపయోగించే మసాలా దినుసులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి అనే విషయం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మసాలా దినుసులను మనం వివిధ రకాల వంటకాలలో సువాసనను, రుచిని పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే అటువంటి మసాలా దినుసులు మనకు కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి .అవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. వాటి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
లవంగాలు
లవంగాలలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. లవంగాలు వంటల రుచిని పెంచడమే కాకుండా జలుబు, దగ్గు, పంటి నొప్పి వంటి సమస్యలకు ఎంతో బాగా పనిచేస్తాయి. లవంగాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన జీర్ణక్రియ, అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను లవంగాలు నివారిస్తాయి.

యాలుకలు
వివిధ వంటకాలలో ఉపయోగించే యాలకులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. యాలుకలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రించబడుతుంది. డిప్రెషన్ ను తగ్గించడానికి యాలుకలు ఎంతో ఉపయోగపడతాయి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో యాలుకలు ఎంత బాగా ఉపయోగపడతాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. డయాబెటిస్ తగ్గించడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. దాల్చిన చెక్కలో మన చర్మానికి ఆరోగ్యాన్నిచ్చే గుణాలు కూడా ఉన్నాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
బిర్యానీ ఆకు
బిర్యానీ ఆకు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా బిర్యానీ ఆకు మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ను ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కడుపునొప్పి, తలనొప్పి, జలుబు వంటి వాటికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications