ఈ అనారోగ్య లక్షణాలు ఉన్న వాళ్లు కూడా నెయ్యి తింటున్నారా- డేంజర్ లో పడ్డట్టే
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. దానికి తోడు ఆవకాయ పచ్చడి ఉంటే టేస్టు వేరే లెవెల్ కు వెళ్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. నెయ్యి లేనిదే ముద్ద దిగని వాళ్లూ చాలామందే. ఇక్కడ ఓ చిన్న లిటిగేషన్ ఉంది. అందరూ నెయ్యి తినకూడదు. నెయ్యి వల్ల కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు నెయ్యికి దూరంగా ఉండటమే మంచింది.
నెయ్యిలో విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే అయినప్పటికీ- అందరూ నెయ్యి తినకూడదు. నెయ్యి వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. నెయ్యిని ఎవరు, ఎప్పుడు తినకూడదు? నెయ్యి అందరికీ మంచిదేనా, లేదా ఎవరు దీనిని తినడం మానేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి పాల ద్వార తయారవుతుంది. కాబట్టి- మిల్క్ అలర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకూడదు లేదా మితంగా మాత్రమే తీసుకోవాలి. అలర్జీ ఉన్న వాళ్లు నెయ్యి తీసుకోవడం వల్ల దద్దుర్లు, దద్దుర్లు, వాంతులు లేదా అతిసారం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. లాక్టోస్ ఇరిటేషన్ ఉన్నవాళ్లు కూడా నెయ్యిని తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు.
- నెయ్యిలో ఆక్సీకరణ చెందిన కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. దీని వల్ల గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
- కాలేయ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి. అధిక నెయ్యి తీసుకోవడం వల్ల అది కాలేయంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. వాపుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
- మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు నెయ్యిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- జ్వరం లేదా శరీరంలో వాపు ఉన్నప్పుడు నెయ్యి తినకపోవడం మంచిది. ఇలాంటి సమయాల్లో నెయ్యిని జీర్ణం చేసుకోవడం కష్టంగా మారవచ్చు. తద్వారా ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి సమస్యలు ఉన్నవారు నెయ్యిని మానుకోవాలి. నెయ్యి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రతరం కావచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి, గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నెయ్యి తినడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
- బరువు పెరగడం అనే సమస్యతో బాధపడేవారు నెయ్యిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. నెయ్యిలో కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి, బరువు నియంత్రణలో ఉన్నవారు జాగ్రత్త వహించాలి.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications