మటన్ పాయా సూప్ వీరికి మంచిది కాదు.. తాగొద్దు! 

సహజంగా మటన్ పాయ సూప్ మంచిదని చెబుతారు. మేక లేదా గొర్రె కాళ్ళతో తయారుచేసిన ఈ సూప్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, ప్రతిరోజు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఎముకలు దృఢంగా మారుతాయి అని చెబుతారు. అయితే కొంతమంది మటన్ పాయ సూప్ తాగడం మంచిది కాదని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మటన్ పాయా సూప్ తో వీరికి హాని

ముఖ్యంగా గుండె సంబంధిత రోగులకు మటన్ పాయ సూప్ తాగడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వులను అధికంగా కలిగి ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది తాగితే హాని కలుగుతుంది. హృదయ సంబంధిత రోగులు సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు.

Health Risks Of Mutton Paya Soup these people to avoid

Take a Poll

మటన్ పాయా సూప్ వీరు తాగకుండా ఉంటేనే మంచిది

మటన్ పాయ సూప్ ను యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు తాగకూడదు. అంతేకాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు మటన్ పాయ సూప్ ను తాగకూడదు. ఈ సమస్యలతో బాధపడే వారు కూడా వైద్యుల సలహా తీసుకొని ఆ తర్వాతే మటన్ పాయ సూప్ తాగడం మంచిది. గర్భిణీ స్త్రీలు మటన్ పాయ సూప్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకుండా ఉంటేనే మంచిది.

వీరికి మటన్ పాయా సూప్ తాగించటం మంచిది కాదు

మటన్ పాయ సూప్ లో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ చిన్న పిల్లలకు కూడా ఇది అంత మంచిది కాదు. ఎముకల నుండి వచ్చే పోషకాలు పిల్లలకు అవసరమే అయినప్పటికీ, అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ వారికి హాని చేస్తుంది, కాబట్టి పిల్లలకు ఇది మంచిది కాదు. వృద్ధులకు ఇది మంచిది అయినప్పటికీ శరీరంలో అప్పటికే ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నవారికి మటన్ పాయ సూప్ ఇవ్వకూడదు.

ఇలా మటన్ పాయా తాగితే ఇన్ఫెక్షన్స్

మటన్ పాయ సూప్ ను తయారు చేయడానికి మాంసాన్ని శుభ్రంగా కడగాలి. మాంసాన్ని శుభ్రంగా కడగకపోయినా, చాలా సేపు ఉడికించకపోయినా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మేక లేదా గొర్రె కాళ్లను శుభ్రంగా కడగకపోతే సాల్మనెల్లా, ఈ కొలి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది.

మటన్ పాయా సూప్ బలమైన పోషకాహారం కానీ జాగ్రత్త

ఇక సరిగా ఉడకని మటన్ కాళ్ళ సూప్ తాగితే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక మటన్ పాయ సూప్ విషయంలో ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. మంచి పోషకాలతో కూడిన సూప్ అయినప్పటికీ పైన పేర్కొన్న వాళ్ళు ఈ సూప్ తాగకుండా ఉంటేనే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+