జామపండు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే తినకుండా ఉండరు!
మన ఆరోగ్యాన్ని కాపాడడానికి పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. పండ్లలో ఉండే పోషకాలు మనలను అనేక రోగాల బారి నుండి కాపాడతాయి. అటువంటి పండ్లలో జామపండు ఒకటి. జామ పండులో ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది.
జామ పండులో ఫుల్ పోషకాలు
జామ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, కార్బోహైడ్రేడ్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల వీటిని ప్రతి రోజు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. జామ పండు తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

జామపండు డయాబెటిస్ బాధితులు తినొచ్చా
ఇందులో నారింజ కంటే రెండు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉండడం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని అంటువ్యాధుల బారినుండి కాపాడుతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామపండు ఒక అద్భుత ఫలమని చెప్పాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ పండ్లను ప్రతిరోజు తినొచ్చు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ కంటెంట్ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కారణంగా ఇది డయాబెటిస్ బాధితులకు ఒక అద్భుతమైన పండుగా చెప్పవచ్చు.
జామపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
జామ పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, సోడియం కారణంగా ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జామపండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచేందుకు సహాయపడుతుంది. జామ పండులో తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
మెదడు పనితీరుకు, చర్మ ఆరోగ్యానికి జామపండు
జామపండులో విటమిన్ కే, విటమిన్ బి త్రీ పుష్కలంగా ఉండడం వల్ల ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నరాలకు పట్టుత్వాన్ని ఇస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జామ పండులో లైకోపీన్, కెరోటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన చర్మ సంరక్షణకు ఎంతగానో దోహదం చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముడతలు తగ్గించడానికి, మేని ఛాయను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
జామపండుతో కంటి ఆరోగ్యం మెరుగ్గా
జామ పండులో ఉండే ఫోలేట్ మన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. జామపండు దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జామపండును రోజుకు ఒకటి తింటే ఎంతో మంచిది. దీనివల్ల మనకు ప్రయోజనమే కానీ నష్టం లేదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications