health tips: మామిడి ఆకుల రహస్యం తెలిస్తే డాక్టర్లతో పనుండదు!!
మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మామిడి ఆకులు చేకూరుస్తాయని చెప్పవచ్చు.
వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడికాయలను, మామిడిపండ్లను గురించి, వాటిలో ఉండే పోషకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మామిడి ఆకుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. కానీ మామిడి ఆకులలో బోలెడన్ని పోషకాలు ఉంటాయని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మామిడి ఆకులు చేకూరుస్తాయని చెప్పవచ్చు. మామిడి చెట్ల ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు మామిడి ఆకులతో చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు.

మామిడి ఆకులతో మధుమేహానికి చెక్
మామిడి ఆకులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఆకులు. లేత మామిడి ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు లేత మామిడి ఆకులను నమిలి తిన్నా, లేదా మామిడి ఆకులను మరిగించి తయారుచేసిన నీటిని తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలకు, ఊబకాయం, గుండె జబ్బులు, జీర్ణ క్రియ, కొలెస్ట్రాల్ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి.

మామిడి ఆకులను ఇలా వాడితే మంచి ప్రయోజనం
మామిడి ఆకులలో ఉండే మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇక మామిడి ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని రాత్రంతా ఉంచి ఉదయాన్నే దాన్ని వడకట్టుకుని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

బీపీ, క్యాన్సర్ కు మామిడి ఆకులు ఎలా పని చేస్తాయంటే
మామిడి ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి మరియు ఫ్లేవనాయిడ్లు , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మామిడి ఆకులు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మామిడి ఆకులలో ఉండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

జుట్టుకు మామిడాకుల వైద్యం
అంతేకాదు మామిడి ఆకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టుకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. జుట్టు నెరిసిపోకుండా ఇవి కాపాడతాయి. ఇవి కొలాజిన్ ఉత్పత్తికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కడుపు పూత చికిత్సలలో కూడా మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కడుపులో అల్సర్లను తగ్గించి, జీర్ణక్రియ మెరుగయ్యేలా మామిడి ఆకులు చేస్తాయి. మామిడి ఆకుల టీ తయారుచేసుకుని తాగిన, మామిడాకులను మరిగించి ఆ నీటితో స్నానం చేసిన ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

మామిడి ఆకుల రహస్యం తెలిస్తే వైద్యులతో పనుండదు
కనుక మామిడి పండే కాదు, మామిడి ఆకులలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే లక్షణాలు ఉన్నాయని సూచిస్తున్నారు. మామిడి ఆకుల రహస్యం తెలిస్తే, మామిడి ఆకులను నిత్యం ఉపయోగిస్తే ఇక వైద్యులతో పని ఉండదని చెబుతున్నారు. మరెందుకాలస్యం రూపాయి ఖర్చు లేని ప్రకృతి ప్రసాదించిన మామిడి చెట్టు ఆకులను ఆరోగ్యం కోసం వాడటం మొదలు పెట్టండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications