health tips: ఖర్చే లేని అధిక బరువును తగ్గించే ఆయుర్వేద చిట్కాలు

ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఊబకాయం. విపరీతంగా బరువు పెరగడం ఏం చేసినా బరువు తగ్గకపోవడం ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్నారు. ఊబకాయం కారణంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నారు. అయితే ఊబకాయం తగ్గించేందుకు ఆయుర్వేదంలో చాలా మంచి చిట్కాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

బరువు తగ్గేందుకు ఇది చెయ్యండి
మరి ఆ ఆయుర్వేద చిట్కాలు ఏమిటో మనము తెలుసుకుందాం. అతి తక్కువ ఖర్చుతో అధిక బరువును తగ్గించే ఆ ఆయుర్వేద చిట్కాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని సేవిస్తే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కాస్త బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.

health tips Ayurvedic tips to reduce weight without heavy expenditure

పసుపు, త్రిఫల చూర్ణంతో బరువు తగ్గుతారు
ఇక గోరువెచ్చని నీటిలో మంచి ఆయుర్వేద పదార్థంగా చెప్పబడే పసుపును వేసుకుని తాగినట్లయితే, పసుపు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, ఊబకాయం నుండి ఉపశమనానికి దోహదం చేస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఆయుర్వేదిక మార్కెట్లో దొరికే త్రిఫల చూర్ణాన్ని వాడితే కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

భోజనం బరువు తగ్గించేలా
ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను చూర్ణాన్ని వేసి స్టవ్ మీద మరిగించి అర గ్లాసు నీళ్లు అయ్యేదాకా ఉంచి ఆపై దానిని గోరువెచ్చగా సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు భోజన సమయానికి ప్రత్యేకత ప్రాధాన్యతను ఇవ్వాలని, ముఖ్యంగా రాత్రివేళ ఏడు గంటల లోపే భోజనం చేయాలని చెబుతున్నారు.

రాత్రి భోజనం, నిద్రకు ప్రాధాన్యత
ఏడు గంటల్లోపు భోజనం చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిద్ర లేకపోవడం జీవక్రియ రేటును దెబ్బతీస్తుందని ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఎవరైతే హాయిగా నిద్రపోతారో వారు ఆరోగ్యంగా ఉంటారని బరువు తగ్గుతారని చెబుతున్నారు.

సీజనల్ కూరగాయలు, పండ్లు తినాలి
ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో సీజనల్ కూరగాయలు సీజనల్ పండ్లను చేర్చుకోవడం మంచిదని వీటివల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి అని చెబుతున్నారు. కనుక బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకుని ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించినా మంచి ప్రయోజనం ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+