health tips: బిర్యానీ ఆకుతో షుగర్ దెబ్బకు పరార్; ఎలా వాడాలంటే..!!

ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్య డయాబెటిస్. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం ప్రతి ఒక్కరికి అతిపెద్ద టాస్క్ గా మారింది. డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం కొంతమంది అలోపతి మందులను వాడితే, మరికొంతమంది ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇక అటువంటి వాటిలో బిర్యానీ ఆకు ఒకటి.

వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాధపడేవారు జీవనశైలిని మార్చుకోవడంతో పాటుగా, సహజసిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యత నివ్వాలి. డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు బిర్యానీ ఆకును మూడుసార్లు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. షుగర్ నియంత్రణలోకి వస్తుంది. అసలు బిర్యానీ ఆకుతో షుగర్ ఏవిధంగా నియంత్రణలోకి వస్తుంది. చేయవలసింది ఏమిటి అంటే..

health tips: Bay leaf controls diabetes; this is the biryani leaf using process!!

ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులను తీసుకుని మూడు గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుంచి దించి రెండు, మూడు గంటల పాటు దానిని చల్లారనివ్వాలి. బిర్యానీ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఆ నీటిలో చేరుతాయి. ఆపై ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు మూడుసార్లు బిర్యాని ఆకు తో తయారు చేసుకున్న కషాయాన్ని తాగాలి.

ఒక మూడు రోజుల పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి గంట ముందుగా దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి, మళ్లీ వరుసగా మూడు రోజులపాటు క్రమంగా దీనిని వాడాలి. ఇలా రెండుసార్లు చేస్తే షుగర్ నియంత్రణలోకి వస్తుంది.

ఇలా చేయడంతో పాటుగా షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే కచ్చితంగా జీవనశైలి మార్చుకోవాలి. కనీసం అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చెయ్యాలి. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరిగా చెయ్యాలి. అయితే సహజసిద్ధమైన విధానాలతో డయాబెటిస్ తెగ్గించుకోవాలంటే నేచురోపతి వైద్యులను సంప్రదించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+