Health tips: ఈ ఆరు కారణాలతోనే బాన పొట్ట.. ఊబకాయంతో జాగ్రత్త!!
ఊబకాయం.. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఊబకాయం ఒక్కొక్కసారి ఇతర అనారోగ్యాలకు దారితీసి ప్రాణాంతకంగా కూడా తయారవుతుంది. ఇక అటువంటి ఊబకాయం ఎందుకు వస్తుంది? ఏ కారణాలతో విపరీతంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది? తగ్గించలేని పొట్ట ఎందుకు వస్తుంది? వంటి విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.
ఊబకాయం రావడానికి ముఖ్యంగా ఆరు కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు .ప్రస్తుతం బెల్లీఫ్యాట్, పొట్టచుట్టూ చెడుకొవ్వు పేరుకు పోవడం అనేది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే చెడు కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది? ఎందుకు ఊబకాయ బాధితులుగా మారుతున్నారు? అంటే అందుకు ముఖ్యమైనది ఆహారం అని చెప్పాలి. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే, తినకూడని ఆహారాన్ని తింటే బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. జంక్ ఫుడ్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల ఊబకాయ బాధితులుగా మారుతారు.

ఊబకాయం రావడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో కారణం వ్యాయామం లేకపోవడం. విపరీతంగా ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయకుండా కూర్చోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ విపరీతంగా పెరుగుతుంది. ఊబకాయ బాధితులుగా మారడానికి మూడవ కారణం అధికంగా మద్యపానం సేవించడం ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ ను క్రమం తప్పకుండా తీసుకుంటున్న వారు ఊబకాయ బాధితులుగా మారుతారని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ఇక విపరీతంగా బరువు పెరగడానికి, ఊబకాయం రావడానికి మరో కారణం అధిక ఒత్తిడి. అధిక ఒత్తిడి వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు పెరగడానికి, బెల్లీ ఫ్యాట్ పెరగడానికి మరొక ప్రధానమైన కారణం సరైన నిద్ర లేకపోవడం. ప్రతి రోజూ 7నుంచి 8గంటల పాటు నిద్రపోవాలి. అయినా చాలామంది అలా నిద్రపోరు. ఇక అలాంటి వారిని ఊబకాయం వేధిస్తోందని చెబుతున్నారు.
ఊబకాయం రావడానికి మరో ముఖ్యమైన కారణం ఎక్కువగా కూర్చుని ఉండడం. గంటలు గంటలు కూర్చోవడం వల్ల, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల, తిన్న తర్వాత ఎటువంటి శారీరక శ్రమ లేక విశ్రాంతి తీసుకుంటున్నట్టు కూర్చోవడం వల్ల కూడా బెల్లీఫ్యాట్ పెరుగుతుంది. ఈ ఆరు కారణాలు బెల్లీ ఫ్యాట్ ను పెంచడంతోపాటు ఊబకాయ బాధితులుగా మనల్ని మారుస్తాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మజ్జిగలో ఇవి కలిపితే అమృతమే -
గ్రీన్ టీ Vs బ్లాక్ టీ: రెండింటి లో ఏది మంచిది, పరిమితి..!! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications