health tips: చెడు కొలెస్ట్రాల్ తగ్గించటానికి సులభమైన చిట్కా!!

కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలామందిని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోయి, రక్తంలో కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిగి ఊహించని విధంగా గుండె జబ్బులకు, బ్రెయిన్ స్ట్రోక్ లకు కారణమవుతున్న అతి పెద్ద సమస్య కొలెస్ట్రాల్ సమస్య.

ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ తీవ్రమైన సమస్యగా ప్రస్తుతం మారుతోంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు గుండె జబ్బులకు అతిపెద్ద కారణమవుతోంది. మనం తీసుకునే కొవ్వు పదార్థాల నుంచి బయటకు వచ్చే జిగట ఒక మైనపు పదార్ధంగా మన శరీరంలో చేరుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది .ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.

 health tips

చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం చెయ్యాలి. అంతేకాదు ప్రతిరోజు కొలెస్ట్రాల్ ను తగ్గించడం కోసం వైద్యుల సూచన మేరకు మందులు కూడా వాడాలి. అయితే చాలామంది కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి మందులకు బదులు ఇంటి చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు.
అటువంటి సులభమైన చిట్కాలలో తమలపాకులు నమలడం ఒకటి. తమలపాకులు మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తమలపాకులు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. తమలపాకులు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధించగలవు. మాక్రో ఫేస్ లలో లిపిడ్ చేరడాన్ని తమలపాకులు తగ్గిస్తాయి.

తమలపాకులలో యూజినాల్ ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. పేగులలో కూడా కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా నిరోధిస్తుంది. తమలపాకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, ప్రతిరోజు తమలపాకులను నమిలి తింటే, తమలపాకులను జ్యూస్ చేసుకుని తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+