health tips: బరువు తగ్గించటంతో పాటు మన ఆరోగ్యంపై సొరకాయ మిరాకిల్స్!!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు.. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఏం తినకూడదు అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. దాదాపు అన్ని కూరగాయలలో పోషకాలు ఉంటాయి. కానీ కొన్ని కూరగాయలే అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి కూరగాయలలో సొరకాయ ఒకటి.
సొరకాయలో బోలెడన్ని పోషకాలు
సొరకాయలలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. సొరకాయలలో ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ ,మెగ్నీషియం పొటాషియం, జింక్ వంటి పోషకాలు సొరకాయల లో పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు సొరకాయలు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సొరకాయతో బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్.. బరువుపై మిరాకిల్స్
సొరకాయ మన జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. సొరకాయలో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. సొరకాయలో ఉండే పోషకాలు బరువు తగ్గడానికి అద్భుతంగా దోహదం చేస్తాయి. బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు సొరకాయ రసాన్ని తాగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ప్రతిరోజు సొరకాయను తినడం వల్ల బిపి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. సొరకాయలో ఉండే పొటాషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.
గుండె ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యంకోసం సొరకాయ
ప్రతిరోజు సొరకాయను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలప్రమాదం తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఒక సొరకాయను తప్పనిసరిగా తినాలని సూచించబడింది. సొరకాయలో ఉండే సహజ నీరు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మపు రంగును మెరుగు పరచడంతో పాటు, శరీరంలో ఊహించని మార్పులు తీసుకువస్తాయి.
డయాబెటిస్ కు, మూత్ర సంబంధ సమస్యలకు సొరకాయ
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సొరకాయను తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయకారిగా ఉంటుంది. అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే డయాబెటిస్ పేషెంట్లు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు తినడం ఎంతో మేలు చేస్తుంది. ఇది మూత్ర సంబంధిత సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications