Health tips: హై బీపీ తగ్గించటానికి ఆహారంలో వీటిని నియంత్రించండి!!

చాలామంది ప్రస్తుతం బీపీ తో బాధపడుతున్నారు. దేశంలో హైబీపీ బారినపడి ఇబ్బంది పడుతున్నవారు లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే బీపీ ఉన్నవారు సహజంగా బీపీని తగ్గించుకోవడానికి ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేసుకోవాలి. బీపీ వచ్చిందంటే ఇక అనేక రోగాలకు కూడా ఆస్కారం ఉంటుంది.బీపీ అదుపులో లేకుంటే నరాలు, కండరాలు దెబ్బ తింటాయి. ఒక్కోసారి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బీపీ పెరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

బీపీ ఉన్నవారు వారు తీసుకునే ఆహారంలో చాలా తక్కువ సోడియం తీసుకోవడం మంచిది. ఎక్కువ సోడియం ఆహారంలో తీసుకుంటే బీపీ విపరీతంగా పెరుగుతుంది. చాలామంది చీజ్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో సోడియం మరియు సంతృప్త కొవ్వు ఉంటాయి. కాబట్టి చీజ్ తినకుండా ఉండటం మంచిది. అంతేకాదు జున్ను ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరుగుతాయి. కాబట్టి జున్నుకు కూడా దూరంగా ఉండటం మంచిది.

Health tips: Control these foods in diet to reduce high BP!!

చాలామంది సూప్ తాగాలి అంటే ఆల్రెడీ తయారుచేసుకున్న సూప్ లను తాగుతారు. అయితే తయారుగా ఉన్న సూప్ లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యాన్డ్ వస్తువులకు బదులుగా ఎప్పుడూ తాజా ఆహారం తీసుకోవాలి. ఇక ఊరగాయలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రాసెస్ చేసిన మాంసం లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తినకూడదు.

చిప్స్, బిస్కెట్లు వంటి ప్యాక్ చేసిన వస్తువులను కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది . మార్కెట్లో దొరికే రకరకాల ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను బిపి పేషెంట్స్ తినకూడదు. ఇవి తినడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది. బీపీ తగ్గడం పక్కనపెట్టి, బీపీ పెరగడం ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తుంది. బిపి పేషెంట్లు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ రక్తపోటు ను మరింత పెంచుతుంది. అందుకే బిపీ పేషెంట్స్ కాఫీ తాగకూడదు అని చెబుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+