health tips: ఏడుపు మంచిదే.. ఏడుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు!!
చాలామంది ఏడుపు మన శరీరానికి, ఆరోగ్యానికి, నష్టం చేస్తుందని, ఎంత కష్టం వచ్చినప్పటికీ ఏడవకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే మనిషి అప్పుడప్పుడు ఏడవాలని, దానివల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్న వారు లేకపోలేదు. ఏడుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలా? వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం.
ఏడుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఏడుపుపై అధ్యయనం చేసిన వారు వెల్లడించారు. బాధ వల్లనో, ఎవరైనా మనసుకు గాయం చేయడం వల్లనో , ఇష్టమైన వాళ్లకు దూరమవడం వల్లనో, మనసుకు కష్టం కలిగించే మాటలు వల్లనో కళ్ల నుండి నీళ్లు వస్తాయి. అలా కళ్ల నుండి నీళ్లు రావడాన్ని ఏడుపు అంటారు.
అయితే ఏడవడం శరీరానికి, మనసుకి కూడా మంచి చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఏడుస్తున్నప్పుడు మన కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. అలా ఏడుస్తున్నప్పుడు వచ్చే కన్నీళ్లు మన కనుబొమ్మలను, కనురెప్పలను శుభ్రం చేస్తాయి. కన్నీళ్లలో బాక్టీరియా మరియు వైరస్ ను తొలగించే పదార్ధాలు ఉంటాయి. కాబట్టి కన్నీళ్లు మన కళ్ళల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను, వైరస్లను కడిగినట్టు తీసిపారేస్తాయి.

ఏడవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏడుపు శరీరంలోని మాంగనీసు స్థాయిని తగ్గిస్తుంది. ఇది మనసు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఏడవటం ఆ బాధ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఏడుపు వల్ల మన మనస్సు పైన ఒత్తిడి తగ్గుతుంది.
మనసులోని బాధను అలాగే ఉంచి, ఏడవకుండా లోలోపలే కుమిలిపోవడం వల్ల లూస్ ఇన్ ఎన్కేఫాలిన్ మరియు ప్రోలాక్టిన్ వంటి కొన్ని రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అవి హాని కలిగిస్తాయి. అందుకే బాగా బాధలో ఉన్నప్పుడు కాసేపు ఏడ్చేస్తే మనసు భారం తగ్గుతుంది. ఏడుపును అణచివేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైతే ఏడుస్తారో అది తగ్గుతుంది.
ఏడుపు డిప్రెషన్ ను దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏడుపు ఒక చికిత్స లాంటిది. ఇది మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏడవడం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్ల స్రావం పెరుగుతుంది. దీని ఫలితంగా మంచి ప్రశాంతమైన, సుఖమైన నిద్ర వస్తుంది. మనసులో ఉన్న భారం తగ్గుతుంది. అందుకే ఏడుపు మంచిదేనని, దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
చుక్కకూర మటన్ కర్రీ సూపర్ టేస్ట్.. ఇలా చేస్తే అన్నం మెతుకు కూడా వదిలిపెట్టరు -
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే, సమస్యలన్నీ పరార్..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications