health tips: డయాబెటిస్ కేవలం 30నిముషాల్లోనే తగ్గుతుంది.. ఎలాగంటే!!
డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనాలను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. డయాబెటిస్ వల్ల శరీరంలోని ఆర్గాన్లు దెబ్బతింటాయి. డయాబెటిస్ ప్రభావం మూత్రపిండాలు, కాలేయం, గుండె తదితరాలపై ప్రభావం పడుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో లేకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్లో పెట్టుకుని ఆరోగ్యంగా జీవించాలి అంటే ఒక పని చేస్తే చాలని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు.
ఆయుర్వేదంలో కాకరకాయకు ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని, అవి డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు. ప్రతిరోజు కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే కాకరకాయ జ్యూస్ తాగిన అరగంటలోపు మన శరీరంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయని చెబుతున్నారు. అంతేకాదు కాకరకాయ జ్యూస్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. కాకరకాయలలో కొవ్వును కరిగించే అనేక గుణాలు ఉంటాయని చెప్తున్నారు.

శరీరంలోని వ్యర్ధపదార్థాలను కాకరకాయ జ్యూస్ బయటకు పంపిస్తుందని, గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా కాకరకాయ జ్యూస్ తాగే వారిలో రాకుండా ఉంటాయని చెబుతున్నారు. కాకరకాయలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని కాకరకాయలో ఇన్సులిన్ లా పనిచేసే ఒక పదార్థం ఉంటుందని చెబుతున్నారు. ప్రీ డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే డయాబెటిస్ సమస్య లేని వారు కూడా మధుమేహానికి దూరంగా ఉండడానికి కాకరకాయ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని చెబుతున్నారు.
కాకరకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, ఫోలేట్ క్యాన్సర్ తో పోరాడుతుందని చెబుతున్నారు. కాకర కాయ రసాన్నే కాకుండా కాకరకాయను నేరుగా తిన్నా, లేక కాకరకాయ పొడిని నీళ్ళలో కలుపుకుని తీసుకున్నా ఫలితం ఉంటుంది. కాకరకాయలతో జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. కాకర కాయల వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కాకరకాయ జ్యూస్ తరచూ తీసుకోవటం వల్ల కిడ్నీలలో ఉండే రాళ్లు పడిపోతాయి. కనుక కాకరకాయ చేదుగా ఉందని దానిని దూరంగా పెట్టకుండా ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications