health tips: పాలతో కలిపి ఈ విరుద్ధ ఆహారాలు అస్సలు తీసుకోకండి.. డేంజర్

పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాదు పాలు మన శరీరానికి కావలసిన ఎముకలు, కండరాల శక్తిని, దృఢత్వాన్ని ఇస్తాయి. పాలు మన ఆహారానికి అనుబంధ ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నిత్యం పాలు తాగడం మంచిదే అయినా పాలతో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.

పాలతో పాటు వీటిని కలిపి తీసుకోకండి
పాలతో సరిపడని కొన్ని విరుద్ధ ఆహారాలు కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి పాలతో కలిసి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. పాలు మరియు పెరుగు కలయిక చెడు ఆహారంగా పరిగణించబడుతుంది. పాలు, పెరుగు కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ పెరిగే అవకాశం ఉంది.

health tips Do not take these anti-foods with milk at all

పాలతో నిమ్మకాయ, పుచ్చకాయ .. ఏమవుతుందంటే
పాలు నిమ్మకాయను కలిపి తీసుకోకూడదు. నిమ్మకాయను పాలతో కలిపి తీసుకోవడం మానేయాలి. నిమ్మకాయతో పాటు పాలతో కలిపి బెల్లం, ఉప్పు కూడా తీసుకోకూడదు. పాలు తీసుకునేటప్పుడు పుచ్చకాయ ముక్కలను పొరపాటున కూడా తినకూడదు. పాలు పుచ్చకాయ చాలా హానికరమైన కలయిక గా పరిగణించబడుతుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల విరోచనాలు వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

పాలతో పప్పులు, ముల్లంగి తీసుకోవచ్చా?
పాలు తాగిన వెంటనే మినప్పప్పును, పెసరపప్పును, శనగపప్పులను తినకూడదు. పాలు తాగిన వెంటనే పప్పులను తింటే జీర్ణక్రియ సరిగ్గా జరగదు. గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పాలు తాగిన తర్వాత ముల్లంగిని, ముల్లంగి తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినకూడదు. పాలతో కలిపి వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ముల్లంగిని తీసుకోవాల్సి వచ్చినా పాలు తాగిన రెండు గంటల తర్వాత మాత్రమే తీసుకోవాలి.

పాలతో కలిపి పుల్లటి పండ్లు.. నాన్ వెజ్ తీసుకుంటున్నారా?
పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లను పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ అలా తింటే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక పాలను నాన్ వెజ్ ఆహారంతో కలిపి పొరపాటున కూడా తీసుకోకూడదు. నాన్ వెజ్ ఆహారంతో కలిపి పాలను తీసుకుంటే ప్రతికూల ప్రభావాలు శరీరంపై ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు పాలను తాగేవాళ్ళు పాలతో కలిపి తీసుకోకూడని విరుద్ధ ఆహారాలను అవాయిడ్ చేయాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+