మూడొందల జబ్బుల్ని నయం చేసే మునగాకు.. అసలు ఖర్చేలేని ఆరోగ్య వర ప్రసాదిని!!
మూడొందల జబ్బుల్ని నయం చేసే మునగాకు అసలు ఖర్చే లేని ఆరోగ్య వర ప్రసాదిని అని చెప్పొచ్చు.
మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని విషయం ఇప్పటికే అనేక మార్లు చెప్పుకున్నాం. ఆకుకూరలలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు బాగా ఉంటాయని, తప్పనిసరిగా ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవాలని కూడా చెప్పుకున్నాం. అయితే మన ఆరోగ్యాన్ని బాగుచేసే మెండైన పోషకాలు అనేక ఆకులలో కూడా ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మునగాకులో మన ఆరోగ్యాన్ని బాగుచేసే సూపర్ గుణాలు ఉన్నాయి అంటే నమ్మి తీరాల్సిందే.

మునగాకులో పుష్కలంగా పోషకాలు
300 జబ్బులు నయం చేసే గొప్ప లక్షణాలు మునగాకు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప గుణాలున్న మునగాకును చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ మునగాకు తో పచ్చడి చేసుకుని, పప్పులో వేసుకొని ఇలా రకరకాలుగా మునగాకును మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి కావలసిన ఖనిజలవణాలు ఉంటాయి.

మునగాకులో పోషకాలతో పాటు ఔషధ గుణాలు
మునగాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నారింజలో కంటే మునగాకులో 7 రెట్లు ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది అంటే నమ్మండి. అలాగే పొటాషియం, కాల్షియం, ఐరన్, ప్రోటీన్, అమైనోయాసిడ్లు మునగాకులో ఉంటాయి. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే మునగాకులో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. మునగాకులో అత్యధిక పోషకాలతో పాటు ఔషధ గుణాలు బాగా ఉండటంతో ఇది అద్భుతమైన మెడిసిన్ అని చెప్పొచ్చు.

మునగాకుతో బీపీ కంట్రోల్
అనేక రోగాలను నయం చేయడంలోనూ, కండరాలకు శక్తిని ఇవ్వడంలోనూ మునగాకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రోగాల నుండి కాపాడుతుంది. రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది. మునగాకులో ఉండే అద్భుతమైన గుణాల వల్ల, మునగాకు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ల వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మన శరీరంలో ఉన్న కొవ్వును కూడా బాగా మునగాకు తగ్గించగలదని చెప్పొచ్చు. రక్త నాళాలలో పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగించే సామర్ధ్యం మునగాకుకు ఉంది.

డయాబెటిస్ కంట్రోల్.. కంటి చూపు మెరుగుదల
మునగాకు నొప్పులు, వాపులు, గాయాలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంలో, డయాబెటిస్ ను అదుపులోకి తీసుకురావడంలో మునగాకు ఎంతగానో పనిచేస్తుంది. మునగాకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. మునగాకు మన మెదడులోని ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యానికి కారణమవుతుంది. కంటి చూపు మందగించిన వారిలోనూ మునగాకు కంటి చూపుని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి కనీసం రెండుసార్లు ఏదో ఒక రూపంలో మునగాకును తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదని చెప్పొచ్చు. ఖర్చు లేని ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉన్న ఆకు మునగాకుని ఆహారంలో భాగం చేసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications