Health tips: బరువు తగ్గాలన్నా, డయాబెటిస్, బీపీ కంట్రోల్ కావాలన్నా ఇవి రోజూ తినండి!!
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహార పదార్థాలను తినాలి? తినే ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పుడు, ఆహారం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయనేది అర్థం చేసుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మన ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ నానబెట్టిన బాదం పప్పును ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు అనేక వ్యాధులను తగ్గించటంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నానబెట్టిన బాదం పప్పు తో ప్రతి రోజును ప్రారంభించడం వల్ల అనేక విధాల లాభాలు ఉన్నాయి.

బాదం పప్పులు ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బాదం పప్పును తినడంతో రోజును ప్రారంభిస్తే వారి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకుంటే నానబెట్టిన బాదం తో మీ రోజును ప్రారంభించాలని కూడా చెబుతున్నారు. నానబెట్టిన బాదం పప్పులు మొత్తం జీర్ణక్రియను సులభతరం చేసి మన శరీరంలో జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తాయి.
మన శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తాయి. మెదడుకు టానిక్ లాగా పనిచేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పని చేసేలాగా బాదంపప్పు చేస్తుంది. బాదం పప్పులు నిత్యం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నానబెట్టిన బాదం పప్పులలో ప్రోటీన్స్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. బాదం పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి.
నానబెట్టిన బాదం పప్పులు అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉండటంవల్ల అది అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది . మలబద్ధకాన్ని నివారించడానికి కూడా ప్రతిరోజూ బాదం పప్పులు తినడం ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణకు, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి బాదంపప్పులు బాగా ఉపయోగపడతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications