health tips: నరాల బలం కోసం వీటిని తినండి!!

నిజజీవితంలో, పరుగుల ప్రపంచంలో పోషకాహారం పైన దృష్టి పెట్టడం మానేశాం. ఆకలిగా అనిపించినప్పుడు ఏది దొరికితే అది తినడం మన శరీర ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల శరీరంలోని నరాలు కూడా బలహీనంగా మారుతాయి. నరాలు బలంగా లేనప్పుడు శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.

అయితే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల, మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల నరాల బలహీనత నుండి బయటపడవచ్చు. చాలామందిలో మధుమేహం కారణంగా, నరాలకు ఏదైనా గాయం కావడం వల్ల, స్ట్రోక్స్ కారణంగా, పోషకాల కొరత వల్ల నరాలు బలహీనంగా మారిపోతాయి. దాంతో ఏ చిన్న బరువును లేపటానికి కాళ్లు, చేతులు సహకరించవు. విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడుతూ జీవితాన్ని సాగించాల్సి వస్తుంది.

healthtips-eatthesefoodsfornervesstrength1

అయితే నరాల బలం కోసం ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల నరాలకు బలం చేకూరుతుంది. నరాలను బలంగా మార్చడంలో డ్రై ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం ఒక గొప్ప మూలకం. ఇది శరీరంలోని నరాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. అందుకే నరాల బలహీనతతో బాధపడేవారు ప్రతిరోజు వారి ఆహారంలో బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్ లను భాగం చేసుకోవాలి.

నరాలను బలంగా తయారు చేయడంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి .అందుకే చేపలను ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

నరాల బలహీనతలను తొలగించడానికి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలలో నరాలు బలానికి కావలసిన పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, మెగ్నీషియం, రాగి, క్యాల్షియం, ఫోలేట్ , వంటి పోషకాలు ఉంటాయి. ఇవి నరాలకు శక్తిని చేకూరుస్తాయి. అందుకే కచ్చితంగా వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+