Health tips: వీటిని నానబెట్టి తినండి.. ఈజీగా బరువు తగ్గండి
ఊబకాయం.. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. అనారోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాలతో వందలో తొంభై మంది ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. ఇక బరువు పెరిగిన తర్వాత, ఇతరత్రా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటే అప్పుడు బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతున్నారు.
చాలామంది ఊబకాయ బాధితులు బరువు తగ్గడానికి అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. కొందరు యోగా, ఏరోబిక్స్, జిమ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రకరకాల డైట్ లను ఫాలో అవుతూ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక బరువు తగ్గడానికి ఆహారం కూడా దోహదం చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

విపరీతంగా బరువు పెంచే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, స్వీట్స్ , కూల్ డ్రింక్స్ వంటి వాటికి గుడ్ బై చెప్పి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, బరువు తగ్గించే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి ఆహారాలలో కొన్ని నానబెట్టిన వాటిని తింటే బరువు ను ఈజీ గా తగ్గించుకోవచ్చు.
వేరు శనగలు రాత్రి నానబెట్టి ఉదయం నిద్రలేచిన తరువాత ఖాళీ కడుపుతో తింటే బరువు బాగా తగ్గుతారు. అంతే కాదు ప్రోటీన్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం కూడా బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

రాత్రంతా నానబెట్టిన బదం పప్పులు తింటే కూడా బరువు బాగా తగ్గుతుంది. రాత్రంతా నీళ్ళలో నానబెట్టి బాదంపప్పును ఉదయం నిద్రలేచిన తర్వాత తీసుకోవడం వల్ల బరువు బాగా తగ్గుతారు. అంతే కాదు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక కిస్మిస్ లను కూడా నానబెట్టి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
2 లేదా3 అంజీర పండ్లను రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ పండ్లను తినడం వల్ల కూడా బరువు బాగా తగ్గుతుంది. ఇది కడుపులోని చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టివీటిని నిత్యం నీళ్ళలో నానబెట్టి తినే ప్రయత్నం చెయ్యండి. ఊబకాయానికి చెక్ పెట్టండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications