రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? జరిగేదిదే!!

పెరుగు అన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. పెరుగన్నం తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని కచ్చితంగా ప్రతి ఒక్కరు పెరుగును, పెరుగుతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోవాలని చెబుతారు. పెరుగన్నంలో ప్రోటీన్ మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయని చెబుతారు.

పెరుగులో ఫుల్ పోషకాలు ..
పెరుగులో విటమిన్ బి12, విటమిన్ బి5, విటమిన్ బి2, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది రక్తపోటు, గుండె జబ్బులను నివారిస్తుంది. ప్రధానంగా టెన్షన్, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని కూడా పెరుగన్నం తినటం మెరుగుపరుస్తుంది.

Health tips Eating curd rice at night these health issues troubles you

రాత్రి పెరుగన్నం తినొచ్చా?
పెరుగన్నం మన గట్ హెల్త్ ను కాపాడుతుందని, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుందని, మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతారు. విరోచనాలు, వాంతులు వంటి సమస్యలతో బాధపడే వారికి పెరుగన్నం దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు. అంతేకాదు పెరుగన్నం డీహైడ్రేషన్ ను నివారిస్తుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పెరుగన్నాన్ని రాత్రివేళ తీసుకోవచ్చా? తీసుకుంటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

రాత్రి పెరుగన్నం తినటం వీరికి అస్సలు మంచిది కాదు
రాత్రి వేళలో పెరుగన్నం తినడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పగటిపూటతో కంపేర్ చేస్తే రాత్రి సమయంలో జీవక్రియ చాలా తక్కువగా ఉంటుంది. రాత్రివేళ పెరుగన్నం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తినకుండా ఉండడం మంచిది. దగ్గుతో బాధపడేవారు, ఊబకాయం ఉన్నవారు, రక్తస్రావం రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న వారు, ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు పెరుగును తినకపోవడం మంచిది.

రాత్రి పెరుగన్నం తింటే వచ్చే సమస్యలివే
రాత్రి వేళల్లో పెరుగు తినడం వల్ల అది త్వరగా జీర్ణం కాక కడుపు అంతా బరువుగా అనిపిస్తుంది. దీంతో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో పెరుగు తింటే బరువు పెరగడం, మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో పెరుగు తినడం మానేయండి. ఎవరికైనా ప్రతిరోజు రాత్రివేళ పెరుగు తినే అలవాటు ఉంటే పెరుగుకు బదులుగా పలుచటి మజ్జిగను తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కడుపును చల్లబరుస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+