Health tips: రాత్రిపూట అన్నం తినటం వల్ల కలిగే నష్టాలివే!!
మన ఆహారంలో ప్రధానమైనటువంటి భాగం అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆహారంలో భాగంగా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అన్నాన్ని అధికంగా తినడం వల్ల, మరీ ముఖ్యంగా రాత్రి పూట అన్నం తినడం వల్ల, అనేక ఇబ్బందులు కలుగుతాయని, నష్టాలు జరుగుతాయి అని చెబుతున్నారు. అసలు రాత్రి పూట అన్నం తినడం వల్ల కలిగే అనర్ధాలు ఏమిటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
రాత్రి పూట అన్నం తినడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడంతో ఊబకాయం సమస్య పెరుగుతుంది. రాత్రి పూట మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఆస్తమాతో బాధపడే వారు రాత్రి పూట అన్నం తినడం వల్ల, వారు మరింత ఆస్తమా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

రాత్రి పూట అన్నం తినడం వల్ల డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి పూట అన్నం తినే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. మధుమేహ బాధితులుగా మారకూడదు అనుకుంటే, లేదా మధుమేహం నియంత్రించాలి అనుకుంటే రాత్రిపూట అది తినకూడదు. రాత్రి ఆలస్యంగా అన్నం తిన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి.
రాత్రి అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్రపోతే శ్వాసకోస వ్యవస్థ పై పడుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. రాత్రి పూట అన్నం తినడం వల్ల సోమరితనం, బద్ధకం పెరుగుతుంది. ఇది మన దినచర్య పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

రాత్రిపూట అన్నం తినడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయి. శరీరంలో అదనంగా కార్బోహైడ్రేట్లు పెరగడం వల్ల, కొవ్వు పేరుకుపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకే బరువు తగ్గాలి అనుకున్నా, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి అనుకున్నా రాత్రి పూట అన్నం తినడం మంచిది కాదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications