Health tips: ఈ 6 కూరగాయలు తింటే యూరిక్ యాసిడ్ పెరగదు!!
రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడమనేది అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. కీళ్ళలో స్పటికాల రూపంలో పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు ప్రమాద ఘంటికలు మోగిస్తాయి. యూరిక్ యాసిడ్ గౌట్ మరియు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా , విసర్జన సరిగా జరగకున్నా క్రమంగా ఇది రక్తంలో ఉండిపోయి ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కొన్ని కూరగాయలు బాగా పనిచేస్తాయి. కొన్ని కూరగాయలలో నీరు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. అటువంటి కూరగాయలు యూరిక్ యాసిడ్ ను పెరగకుండా నివారిస్తాయి. ఇక అలాంటి వాటిలో గుమ్మడికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను పెరగకుండా చేస్తుంది.

టమాటాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలకు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే శక్తి ఉంటుంది. కీరా దోసకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని వినియోగం యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
బీటా గ్లూకాన్ అనేది పుట్టగొడుగుల్లో కనిపించే ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది మంట నుండి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. అలాగే పుట్టగొడుగులు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి. క్యాబేజీలో నీరు అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.
ఇక నిమ్మకాయలు కూడా యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయ పిండుకుని అందులో అర టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని తాగితే యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications