health tips: ఎండు చేపల వాసనే భరించలేనిదిగా.. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా!!
చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పచ్చి చేపలైనా, ఎండు చేపలైనా వాటిలో ఉండే పోషకాలే వేరు. తరచూ చేపలను తిన్నవారు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ముఖ్యంగా ఎండు చేపల విషయానికి వస్తే అవి భయంకరమైన వాసన వస్తాయని భావించి చాలామంది వాటిని తినడానికి ఇష్టపడరు. కానీ ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
ఎండు చేపలు గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఎండు చేపలలో పుష్కలంగా ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, నియాసిన్, విటమిన్ బి12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కేలరీలు, సోడియం ఉంటాయి. ఎండు చేపలను తినడం వల్ల శరీరం పొడిబారడం తగ్గుతుంది. అంతేకాదు రక్తపోటును, నరాల సమస్యలు ఎండు చేపలు నియంత్రిస్తాయి. కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయి.

ఎండు చేపలలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను, కండరాలను, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఎండు చేపలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఎండు చేపలు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచివి. ఎండు చేపలలో పాస్పరస్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ఎముకలు పుష్టిగా ఉంటాయి.
అంతే కాదు దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి కూడా ఎండు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండు చేపల్లో పుష్కలంగా ఉంటాయి.
100 గ్రాముల పచ్చి చేపలతో పోల్చి చూస్తే 100 గ్రాములు ఎండు చేపల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. కాబట్టి ఎండుచేపల వాసన పక్కనబెట్టి తరచుగా తినండి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఎన్నో పోషకాలు వాటిలో ఉన్నాయని అర్ధం చేసుకోండి. ఎండు చేపలను ఆహారంలో భాగం చేసుకోండి. రుచికరంగా, శుచిగా వండుకు తినండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications