health tips: విపరీతమైన నరాల నొప్పులా? ఈ డైట్ మార్చి.. రిజల్ట్స్ మీరే చూడండి!!
ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శరీరానికి కావలసిన విటమిన్లు సరిగ్గా అందకపోవడం, క్రమబద్ధమైన జీవిత విధానం లేకపోవడం వంటి అనేక కారణాలు నరాల నొప్పులకు మూలంగా మారుతున్నాయి. అయితే నరాల బలహీనతతో వివిధ రకాల నొప్పులకు లోనవుతున్న వారు, బలహీనత తగ్గించుకోవడం కోసం తీసుకోవలసిన పౌష్టికాహారం పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నరాల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఇవి తినండి
నరాల బలహీనతను తగ్గించుకోవాలంటే, నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలలో, మనం నరాలకు సంబంధించిన బలాన్ని చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి నరాల సమస్యలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.

ఈ పండ్లతో నరాలకు బలం.. నొప్పుల నుండి ఉపశమనం
నరాల బలహీనతను తగ్గించే ఆహారాలలో పండ్లు ముఖ్యమైనవి. దానిమ్మ పండు, నారింజపండు, కివీస్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు నరాల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి దానిమ్మలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ నరాలకు కావలసిన శక్తినిస్తుంది. ఇక నారింజ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నరాల నొప్పులను వాపులను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

నరాల ఆరోగ్యం కోసం ఆహారంలో వీటిని మర్చిపోకండి
నరాల ఆరోగ్యం మెరుగుపడాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను, అవిసె గింజలను, అక్రోట్ గింజలను రోజు తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు ముదురు రంగులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఏవైనా నరాల ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. పసుపుతోనూ నరాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పసుపును మనం నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని సూచన. నరాల ఆరోగ్యం మెరుగుపడాలి అంటే నిత్యం 150 నుండి 200 గ్రాముల పండ్లు, 200 గ్రాముల కూరగాయలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు.

నరాల ఆరోగ్యం కోసం వీటి జోలికి అస్సలే పోకండి.. ఆ ఆహారాలకు దూరం ఉండండి
ఇక నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావించేవారు ఫాస్ట్ ఫుడ్ లకు దూరంగా ఉంచాలి . వారు అధికంగా నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వేపుళ్లను అసలే తినకూడదు. తీపి పదార్థాలకు, స్వీట్ లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇవి నరాల ఆరోగ్యానికి మరింత హానిని చేకూరుస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, సరైన నిద్రపోతూ, పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే నరాల నొప్పుల నుండి, నరాల బలహీనత నుండి ఉపశమనం పొందచ్చని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications