Health tips: ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కావాలంటే ఈ ప్రాధమిక సూత్రాలు పాటించండి!!

ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కావాలంటే కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించాలని చెప్తున్నారు.

ఆరోగ్యంగా జీవించాలని ఎవరు మాత్రం అనుకోరు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలని భావిస్తారు. అయితే అందుకు వారు చేయవలసింది ఏమిటి అన్న దానిపైన పెద్దగా దృష్టి పెట్టరు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన జీవన విధానం ఏమిటి? అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి? చేయవలసిన పనులు ఏమిటి? అన్న దానిపైన దృష్టి పెట్టకుండా ఎంతకాలం బ్రతుకుతామో ఏమో అంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానంతో ఆందోళన చెందుతూ ఉంటారు.

ఆరోగ్యం, ఆయుష్షు కావాలంటే ఈ పని చెయ్యాల్సిందే

ఆరోగ్యం, ఆయుష్షు కావాలంటే ఈ పని చెయ్యాల్సిందే

అయితే అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి అన్న తాపత్రయం ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు కావలసిన ఆచరణ ప్రణాళిక ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అని భావించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయకుండా గంటలకు గంటలు కూర్చున్నా, రోజంతా నిద్రపోయినా అనారోగ్యమే వస్తుంది. మనం తీసుకునే ఆహారానికి, మన శరీరానికి వచ్చే ఎనర్జీకి తగ్గట్టు, ఆ ఎనర్జీ ని ఖర్చు చేయడానికి తగినంత వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. వ్యాయామం లేకపోతే శరీరం రోగగ్రస్తమవుతుంది. ఇక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.

 ఆరోగ్యంగా ఉండాలంటే ఇదొక ముఖ్యమైన సూత్రం

ఆరోగ్యంగా ఉండాలంటే ఇదొక ముఖ్యమైన సూత్రం


ఇక ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు పాటించవలసిన మరొక ముఖ్యమైన సూత్రం పౌష్టిక సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరానికి ఏ ఆహారాన్ని ఇస్తే పుష్టిగా ఉంటుంది. మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఎటువంటి ఆహారంలో పుష్కలంగా ఉంటాయి వంటి విషయాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అనేక రోగాలు రాకుండా ఉంటుంది. పౌష్టిక ఆహారంతో మన ఆయుష్షు మరో పదేళ్లు పెరుగుతుంది.

ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరగాలంటే ఇలా ఉండటం అవసరం

ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరగాలంటే ఇలా ఉండటం అవసరం


ఇక ఆరోగ్యంగాను, సంతోషంగానూ ఉండాలి అనుకునేవారు ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం, మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. మానసికంగా ఒత్తిడి లేకుండా జీవనం సాగించగలిగితే కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాదు కచ్చితంగా మన ఆయుష్షు మరో పదేళ్లు పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం, పౌష్టికాహారంతో పాటు ప్రతి ఒక్కరూ మానసికంగా ప్రశాంతంగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. టెన్షన్ లను పక్కన పెట్టేసి సంతోషంగా జీవించాలి.

ఆరోగ్యం కోసం ఈ విషయంలో అస్సలే నిర్లక్ష్యం వద్దు

ఆరోగ్యం కోసం ఈ విషయంలో అస్సలే నిర్లక్ష్యం వద్దు


ఇక ఆరోగ్యంగా జీవించాలి అనుకునేవారు నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోకపోతే ఆరోగ్యం ఘోరంగా దెబ్బ తింటుంది. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు నిద్రను అసలే విస్మరించకూడదు. కచ్చితంగా సమయం ప్రకారం నిద్రపోవడం మంచి ఆరోగ్యవంతుని లక్షణం. కాబట్టి మంచి ఆయుష్షుతో సంతోషంగా బ్రతకాలనుకునేవారు వ్యాయామం, మంచి నిద్ర, పోషకాహారం, ఒత్తిడి లేని జీవితాన్ని అలవాటు చేసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+